IPL 2023 : కొడుకు అర్జున్‌ వేస్ట్‌.. అల్లుడూ ‘గిల్‌’ బెస్ట్‌.. సచిన్‌ వారసుడిపై పేలుతున్న మీమ్స్‌!

వరుస వీడియోలతో శుభ్‌మన్‌ గిల్‌ ఫ్యాన్స్‌తోపాటు సచిన్‌ ఫ్యాన్స్‌ కూడా సచిన్‌ వారసుడు గిల్‌ అని ఫిక్స్‌ అవుతున్నారు. శుభ్‌మన్‌ తప్పకుండా సచిన్‌ టెండుల్కర్‌ అల్లుడు అవుతాడంటూ కామెంట్‌ చేస్తున్నారు.

  • Written By: DRS
  • Published On:
IPL 2023 : కొడుకు అర్జున్‌ వేస్ట్‌.. అల్లుడూ ‘గిల్‌’ బెస్ట్‌.. సచిన్‌ వారసుడిపై పేలుతున్న మీమ్స్‌!
IPL 2023 : శుభ్‌మన్‌ గిల్‌.. ప్రస్తుతం క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఈ పేరు మారుమ్రోగుతోంది. ఐపీఎల్‌ సీజన్‌ 16లో నాలుగు మ్యాచ్‌లలో మూడు సెంచరీలతో చలరేగుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే గిల్‌ కారణంగానే గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరింది. రెండో క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో ముంబయ్‌ ఇండియన్స్‌ జట్టుపై తుఫాను వేగంతో పరుగుల వరద పారించాడు. కేవలం 49 బంతుల్లో సెంచరీ చేశాడు. గిల్‌ వీరవిహారంతో గుజరాత్‌ టైటాన్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఇక ముంబై జట్టుకు మెంటర్‌గా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వ్యవహరిస్తుండగా, జట్టులో సచిన్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ బౌలర్‌గా ఉన్నాడు. గిల్‌ గతంలో ఉప్పల్‌ వేదికగా సచిన్‌ పేరిట ఉన్న 175 పరుగుల వ్యక్తిగత స్కోరును గిల్‌ బద్దలు కొట్టాడు.
సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌.. 
సచిన్‌ టెండుల్కర్, అర్జున్‌ టెండుల్కర్‌ ఉన్న ముంబై ఇండియన్స్‌ జట్టుపై వీరవిహారం తర్వాత శుభ్‌మన్‌ గిల్‌పై ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. అందులో శుభ్‌మన్‌ గిల్‌ ఫ్యాన్స్‌ ఎడిట్‌ చేసి రూపొందించిన ఈ వీడియో ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముంబై ఇండియన్స్‌ జట్టుపై శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీ తర్వాత ఈ వీడియో విడుదల చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఎడిట్‌ చేసి సిచువేషన్‌కు తగినట్లు తీర్చిదిద్దారారు..
అల్లుడు నాకు బాగా నచ్చాడు.. 
ఈ వీడియోలో సచిన్‌ మాట్లాడుతున్నట్లుగా ‘అమ్మా నందిని అల్లుడు నాకు బాగా నచ్చాడు అనగానే సచిన్‌ కూతురు సారా టెండుల్కర్‌ ఫొటో చూపించారు. నా బిడ్డతోపాటు నా ఖాన్‌దాన్‌ మొత్తం నీకే ఇస్తా.. ఇక నుంచి ఈ సీమ నీది.. అల్లాడించు.. నాగిరెడ్డి అల్లుడు వస్తున్నాడంటే ఎవడూ నీకు ఎదురు పడకూడదు అని డైలాగ్‌ చెప్పగానే శుభ్‌మన్‌ గిల్‌ క్యారెక్టర్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఇక నీ బామ్మర్ది వేస్ట్‌.. ఎదవ.. ఎందుకూ పనికిరాడు అని సచిన్‌ క్యారెక్టర్‌ డైలాగ్‌ చెప్పగానే అర్జున్‌ టెండూల్కర్‌ ఫొటో చూపించారు. అందుకే నీలాంటి అల్లుడి కోసం చూస్తున్నా అని సచిన్‌ క్యారెక్టర్‌ నుంచి మరో డైలాగ్‌’ మొత్తంగా సచిన్‌ వారసుడు శుభ్‌మన్‌ అనేలా ఈ వీడియోను ఎడిట్‌ చేశారు.
గతంలో కూడా.. 
గతంలో కూడా శుభ్‌మన్‌ గిల్‌ కి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్‌ అయింది. అందులో శుభ్‌మన్‌ గిల్‌ అభిమానులకు షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ కనిపించాడు. అయితే వారిలో ఒక వ్యక్తి ‘గిల్‌.. సచిన్‌ని కాస్త జాగ్రత్తగా చూసుకో’ అంటూ కామెంట్‌ చేశాడు. ఆ మాట అనగానే పక్కన ఉన్న వాళ్లంతా గోలగోల చేశారు. గిల్‌ కూడా విండో క్లోజ్‌ చేసుకుంటూ సిగ్గు పడుతూ కనిపించాడు. అభిమానులు అన్న ఆ మాటకు బుగ్గన చొట్టపడేలా నవ్వుకున్నాడు.
గిల్‌ అల్లుడని ఫిక్స్‌ అయిన ఫ్యాన్స్‌.. 
వరుస వీడియోలతో శుభ్‌మన్‌ గిల్‌ ఫ్యాన్స్‌తోపాటు సచిన్‌ ఫ్యాన్స్‌ కూడా సచిన్‌ వారసుడు గిల్‌ అని ఫిక్స్‌ అవుతున్నారు. శుభ్‌మన్‌ తప్పకుండా సచిన్‌ టెండుల్కర్‌ అల్లుడు అవుతాడంటూ కామెంట్‌ చేస్తున్నారు. కావాలని కోరుకుంటున్నారు. కూడా అయితే ఈ విషయంలో ఎవరూ క్లారిటీ ఇవ్వం లేదు.
సారా ప్రేమలో గిల్‌.. 
ఇదిలా ఉంటే.. గిల్‌– సారా టెండుల్కర్‌ ప్రేమలో ఉన్నారు, డేటింగ్‌ చేస్తున్నారు, వెకేషన్స్‌కి కి వెళ్తున్నారు అంటూ ఇప్పటికే చాలాసార్లు పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు ఈ వీడియో ఉదాహరణగా చూపిస్తూ ఆ విషయాన్ని పక్కా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. అదేంటంటే.. శుభ్‌మన్‌ గిల్‌ రిలేషన్‌లో ఉంది సారా టెండుల్కర్‌తో కాదు.. సారా అలీఖాన్‌తో అంటూ కొందరు వాదిస్తుంటారు. మరి.. ఆ విషయంలో క్లారిటీ రావాలంటే ఆ ముగ్గురే స్వయంగా స్పందించాల్సి ఉంటుంది. మరోవైపు సారా – గిల్‌ లవ్‌ బ్రేకప్‌ అయిందన్న వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తంగా కొత్త వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. నెటిజన్లు కూడా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. సచిన్‌ అల్లుడా.. మజాకా అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఐపీఎల్‌–16లో అంతగా రాణించలేకపోయిన అర్జున్‌ టెండుల్కర్‌ వేస్ట్‌ అని ఏకీభవిస్తున్నారు.

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు