Pawan Kalyan : వాలంటీరు వ్యవస్థపై పవన్ కళ్యాణ్ వేసిన మౌలిక ప్రశ్నలకి సమాధానాలేవి?
వాలంటరీ వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలను వక్రీకరించి పక్కదారి పట్టించాలని చాలా మంది చూస్తున్నారు. ముందుగా పవన్ లేవనెత్తిన ప్రశ్నలు ఏంటి? వాలంటీరు వ్యవస్థపై పవన్ కళ్యాణ్ వేసిన మౌలిక ప్రశ్నలకి సమాధానాలేవి? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రెండో విడత వారాహి యాత్ర అద్భుతంగా కొనసాగుతోంది. వైసీపీకి ఇది మింగుడుపడడం లేదు. దాన్ని దృష్టి మరల్చడానికి విష ప్రచారం మొదలుపెట్టాడు. వలంటీర్ల విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. నిన్న కార్యకర్తల సమావేశంలో దీనిపై వివరణ కూడా ఇచ్చాడు.
పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానాన్ని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మా కాదు మాట్లాడాల్సింది సీఎం జగన్ మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ కొన్ని మౌలిక ప్రశ్నలు లేవనెత్తాడు వాలంటరీ వ్యవస్థ మీద. అవి నిజమా? కాదా? అని చెప్పాల్సింది సీఎం జగన్ మోహన్ రెడ్డి. కానీ వాసిరెడ్డి పద్మతో చెప్పించారు.
ఏలూరు సభలో పవన్ కళ్యాణ్ కాగ్ ఇచ్చిన రిపోర్ట్స్ ని సభలో మాట్లాడుతూ వైసీపీ కాజేసిన సొమ్ము గురించి చెప్పుకొచ్చాడు. వీటికి సమాధానం చెప్పే ధైర్యం లేక, వాలంటీర్ వ్యవస్థ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ, నిరసన తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లతో ధర్నాలు చేయిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే నేడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వీరమహిళలతో సమావేశం ఏర్పాటు చేసాడు.వాలంటీర్ల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందిస్తూ ‘వాలంటీర్లు తమ మనోభావాలు దెబ్బ తిని నా దిష్టి బొమ్మలను తగలబెడుతున్నారు అని తెలిసింది. సంతోషం ఏమి చేసుకుంటారో చేసుకోండి, మీకు అంతలా కోపం కలిగింది అంటే అందులో నిజం ఉండబట్టే కదా, తప్పు జరుగుతున్నట్టే కదా’ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
వాలంటరీ వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలను వక్రీకరించి పక్కదారి పట్టించాలని చాలా మంది చూస్తున్నారు. ముందుగా పవన్ లేవనెత్తిన ప్రశ్నలు ఏంటి? వాలంటీరు వ్యవస్థపై పవన్ కళ్యాణ్ వేసిన మౌలిక ప్రశ్నలకి సమాధానాలేవి? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
