Samantha: యశోద నుంచి ఖుషి వరకు : తన బాధను తెరపైన కథలతో చూపిస్తున్న సమంత

మొదటగా వచ్చిన సినిమా యశోద.. ఈ సినిమా చూస్తే ఆ సినిమాలో సమంత ఒక ఫైటర్ గా కనిపిస్తుంది. లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ముందుకు వెళుతుంది.

  • Written By: Vishnupriya
  • Published On:
Samantha: యశోద నుంచి ఖుషి వరకు : తన బాధను తెరపైన కథలతో చూపిస్తున్న సమంత

Samantha: సమంత…ప్రస్తుతం జనరేషన్ హీరోయిన్స్ లో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించిన నటి. రియల్ లైఫ్ లో అందరితో కలిసిపోతూ.. ప్రత్యూష అనే ఫౌండేషన్ ని నడుపుతూ.. తన వంతు సహాయం చేస్తూ ఉంటుంది ఈ హీరోయిన్. చిన్నప్పుడు నుంచి కూడా తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొంది అని పలుమార్లు చెబుతూ వచ్చింది సమంత. ఇక స్టార్ హీరోయిన్ అయ్యాక తన కష్టాలన్నీ తీరిపోయినట్టే అనుకున్నారు అందరూ.

కానీ అలా జరగలేదు.. ముందుగా సిద్ధార్థ ని ప్రేమిస్తే ఆ తర్వాత ఆ హీరో ఉమనైజర్ అని తెలిసి తాను వదిలేసింది అనే వార్తలు వచ్చాయి. ఇక తర్వాత నాగచైతన్యతో పెళ్లయితే.. అప్పుడున్న సమంత హ్యాపీగా ఉంటుంది అనుకోగా.. కొన్ని కారణాలవల్ల ఆయనతో కూడా విడిపోయింది. కాగా ఈ కారణం మాత్రం ఎవరికీ తెలీదు.

కానీ విడాకుల దగ్గర నుంచి సమంత తీసే ప్రతి సినిమా .. తన బాధను తానే స్క్రీన్ పైన చూపించకుంటూ ఉందా అనిపించక మానదు. డైవర్స్ అయిన వెంటనే సమంత చేసింది పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్.. ఆ సాంగ్ చూడగా ఇది తప్పకుండా సమంత నాగచైతన్య పైన ఉన్న కోపంతోనే తీసింది అని మనకు అర్థమవుతుంది.

ఇక మొదటగా వచ్చిన సినిమా యశోద.. ఈ సినిమా చూస్తే ఆ సినిమాలో సమంత ఒక ఫైటర్ గా కనిపిస్తుంది. లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ముందుకు వెళుతుంది. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా సమంత ఫైతరే. అందుకే డైవర్స్ అయిన తర్వాత కూడా కుంగిపోకుండా.. మళ్లీ సినిమాల బాట పట్టి తన పని తాను చేసుకుంటూ వెళుతోంది.

ఇక శాకుతలం సినిమా విషయానికి వస్తే.. భర్త వదిలేస్తే భార్య పడే కష్టాలు ఈ సినిమాలో కనిపిస్తాయి. రియల్ లైఫ్ లో కూడా సమంత అలానే బాధపడి ఉండొచ్చు.

ఇక ఇప్పుడు ఖుషి సినిమాకి వస్తే.. ఈ సినిమాలో అన్ని విషయాలను చాలా ఎమోషనల్ గా తీసుకునే అమ్మాయిగా.. అలానే ఆత్మాభిమానం ఎక్కువగా ఉండే అమ్మాయిగా కనిపిస్తుంది సమంత. రియల్ గా సమంత ని చూస్తే కూడా మనకు ఇదే అనిపిస్తుంది. వీటి వల్లే సినిమాలో విజయ్ దేవరకొండ సమంత విడిపోయేదాకా వెళతారు. మరి రియల్ లైఫ్ లో కూడా అదే జరిగిందా అనేది సందేహం.

మొత్తానికి నిజానిజాలు.. కారణాలు పక్కన పెడితే తన ప్రతి సినిమాలో తన బాధను తెరపైన సమంత చూపిస్తుందేమో అని మాత్రం అనిపిస్తోంది.

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు