Citroen C3 Aircross: భారత మార్కెట్లోకి ఫ్రెంచ్ బేస్డ్ కారు.. ధర ఎంత? ఎప్పుడు రిలీజ్?
ఇండియాలో ఇప్పటి వరకు ఎస్ యూవీలల్లో కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, వోక్స్ వ్యగాన్ టైగున్, స్కోడా కుషాక్ లు అలరిస్తున్నాయి. వీటికి గట్టి పోటీ ఇచ్చేందుకు ఇప్పుడు సిట్రియోన్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టబోతుంది.

Citroen C3 Aircross దేశంలో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో ఇప్పుడున్న కంపెనీలకు పోటీగా కొత్త కొత్త కంపెనీలు అవతరిస్తున్నాయి. దేశంలోనివే కాకుండా విదేశాలకు చెందిన కార్లు ఇక్కడ అడుగుపెడుతున్నారు. వినియోగదారుల అభిరుచులు మారుతూ ఎస్ యూవీలపై ఫోకస్ పెడుతుండడంతో చాలా కంపెనీలు వారికి అనుగుణంగా ఎస్ యూవీలను రంగంలోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మార్కెట్లోకి రాబోతుంది Citroen C3 Aircross. ఫ్రెంచ్ బేస్డ్ కలిగిన ఈ కారు అక్టోబర్ 15 నుంచి మార్కెట్లోకి రానుంది. ఈ తరుణంలో దీని బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. మరి దీని వివరాల్లోకి వెళితే..
ఇండియాలో ఇప్పటి వరకు ఎస్ యూవీలల్లో కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, వోక్స్ వ్యగాన్ టైగున్, స్కోడా కుషాక్ లు అలరిస్తున్నాయి. వీటికి గట్టి పోటీ ఇచ్చేందుకు ఇప్పుడు సిట్రియోన్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టబోతుంది.ఈ సంస్థ నుంచి సీ3, ఈసీ3 మోడళ్లను తీసుకొస్తోంది. 90 శాతానికి పైగా దీనిని దేశీయంగానే తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇందోక కాంపాక్ట్ ఎస్ యూవీ కావడంతో చాలా మంది కారు వినియోగదారులు బుకింగ్ చేసుకుంటున్నారు. రూ.25 వేల టోకెన్ అమౌంట్ తో షోరూమ్స్ లోనూ అందుబాటులో ఉంది.
ఈ మోడల్ ఎయిర్ క్రాస్ లో 10 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ పోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్ ఓఆర్ వీఎంలు, టీపీఎంఎస్ రేర్ వైపర్ విత్ వాషర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రేర్ డిఫాగర్ వంటివి ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ తో భద్రతను ఇస్తుంది. 5 సీటర్, 7 సీటర్ తో కలిగి ఉన్న ఇది కాన్ఫిగరేషన్ ఉంది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 1008 హెచ్ పీ పవర్ ను, 190 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
సిట్రియెన్ సీ 2 ఎయిర్ క్రాసన్ ను ఈ ఏడాది ఏప్రిల్ లోనే రివీల్ చేశామని, అప్పటి నుంచి దీనికి మంచి స్పందన వస్తుందని ఎండీ రోలాండ్ బౌచర వెల్లడించారు. భారతీయుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ మోడల్ నురూపొందించామన్నారు. ఈ మోడల్ ప్రారంభ ఎక్స్ షో రూం ధర రూ.9.99 లక్షలుగా ఉంది. మోనోటోన్, డ్యూయెల్ టోన్ సహా మొత్తం 10 రంగుల్లో అందుబాటులో ఉంది. వినియోగదారులకు ఇష్టమైన కలర్ ను ఎంపిక చేసుకోవచ్చు.
