Donald Trump: ట్రంప్ మరణించాడంటూ కుమారుడి అకౌంట్ నుంచే ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్.. జగింది ఇదీ..
ప్రస్తుతం ట్రంప్ మరణించినట్లు పోస్ట్ అయిన ఆయన కుమారుడి ఖాతా నుంచి పోస్టు అయిన ట్వీట్‌లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Donald Trump: ‘మా నాన్న డొనాల్డ్ ట్రంప్ మరణించాడని తెలియజేయడానికి బాధగా ఉంది. 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నేను అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్నాను’ ఇదీ ట్రంప్ కుమారుడు కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విట్టర్ అకౌంట్‌లో సెప్టెంబర్ 20వ తేదీన ఉంది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్వీట్ చేసినట్లున్న ఈ ట్వీట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ట్రంప్ మరణించాడంటూ పోస్ట్ చేయడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలు స్పందించారు. అయితే ఈ ట్వీట్‌లో ఎలాంటి నిజం లేదని ట్విట్టర్ ప్రకటించింది. మరి ఆయన కుమారుడు ఈ ట్వీట్ ఎందుకు చేశాడో తెలుసా?
ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..
డోనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తర్వాత గుర్తించారు. హ్యాకర్లు కావాలనే ఈ పోస్టును చేసినట్లు ట్విట్టర్ అధికారులు ప్రకటించారు. టెక్నికల్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది. వెంటనే పోస్టులను తొలగించారు. అనంతరం ట్విట్టర్ అకౌంట్‌ను తిరిగి యాక్టివేట్ చేశారు. ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మరణ వార్తపై తానే స్వయంగా స్పందించారు. ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేస్తూ తన రణ వార్తను పుకారుగా కొట్టి పడేశారు.
స్క్రీన్‌షాట్స్ వైరల్..
ప్రస్తుతం ట్రంప్ మరణించినట్లు పోస్ట్ అయిన ఆయన కుమారుడి ఖాతా నుంచి పోస్టు అయిన ట్వీట్‌లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొత్తం మీద ఈ ట్వీట్ వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారి తీసింది.
వచ్చే ఎన్నికల్లో పోటీకి ట్రంప్..
ఇదిలా ఉండగా పలు కేసులు ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీకి సిద్ధమవుతున్నారు. ఇటీవల ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. మళ్లీ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకుంటానని ధీమాగా చెప్పారు. 2024 ఎన్నికల్లో పోటీ కోసం అమెరికా ఫెడరల్ ఎలక్షన్ కమిషన్‌కు పత్రాలు సమర్పించారు. ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. అయినా ట్రంప్ ఏ మాత్రం తగ్గడం లేదు. తమ పార్టీ మరింత బలపడిందని, అమెరికన్ల కలను సాకారం చేసి తీరతానని అంటున్నారు. అందుకే మళ్లీ పోటీలో ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
