Andrew Symonds Passed Away: ఆస్ట్రేలియా క్రికెట్ కు ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. మొన్న షేర్న్ వార్న్ మరణం జీర్ణించుకోలేకపోతన్న తరుణంలో ఇప్పుడు ఆండ్రూ సైమండ్స్ మృతి తో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. క్రికెట్ కు వరుసగా క్రికెట్ దిగ్గజాలు దూరమవుతుంటే ఇక ఏం చేయాలనే దానిపై ఆలోచనలో పడిపోతున్నారు. ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరమే టౌన్స్ విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్ తన ప్రాణాలు వదలడం బాధాకరమే. దీంతో క్రికెట్ అభిమానులను శోకసంద్రంలో ముంచింది.

Andrew Symonds
సైమండ్స్ జీవితంలో ఓ వివాదం మాత్రం మచ్చగానే మిగులుతోంది. 2008లో సిడ్నీలో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్ లో హర్భజన్ తనను మంకీ అన్నాడని సైమండ్స్ ఫిర్యాదు చేయడంతో ఆ వివాదం ఏర్పడింది. అప్పుడు జట్టులో సభ్యుడైన సచిన్ మంకీ అనలేదని మా..కీ అన్నాడని చెప్పినా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వినిపించుకోలేదు. హర్భజన్ పై 50 శాతం మ్యాచ్ ఫీజు కోత, మూడు మ్యాచుల్లో నిషేధం విధించింది. దీంతో టీమిండియా దాన్ని వ్యతిరేకించి తాము మ్యాచ్ ఆడమని ఇండియా తిరిగి వెళ్తామని చెప్పడంతో అతడిపై నిషేధం ఎత్తివేశారు.
Also Read: National Family Health Survey: భార్యలను కొట్టే భర్తల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానం!
ఈ వివాదం కొద్ది రోజులపాటు సాగింది. ఇక అప్పటినుంచి సైమండ్స్ తరువాత ఫామ్ కోల్పోయాడు. క్రికెట్ నుంచి వైదొలిగాడు. మంకీ గేట్ వివాదం వల్లే సైమండ్స్ క్రికెట్ జీవితం ఎటూ కాకుంా పోయిందనే వాదనలు కూడా వచ్చాయి. అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీంతో సైమండ్స్ మనస్తాపానికి గురై నిరాశలో వెళ్లిపోయాడని చెబుతారు.

Andrew Symonds
దీంతో అప్పటి నుంచి ఆండ్రూ సైమండ్స్ జాతకమే మారిపోయింది. ఎక్కడ కలిసి రాలేదు. దీంతో క్రికెట్ కే వీడ్కోలు చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో సైమండ్స్ క్రికెట్ కు దూరమైనట్లు తెలుస్తోంది. టీమిండియాతో జరిగిన గొడవ తరువాత సైమండ్స్ జీవితమే కలిసి రాకుండా పోయింది. దీంతో కష్టాలు ఎదుర్కొన్నాడు. సో తన జీవితంలో మన హర్భజన్ సింగ్ తో పెట్టుకున్న సైమండ్స్ కు అదో మచ్చగానే మిగిలిపోవడం గమనార్హం.
Also Read:Amit Shah- Bandi Sanjay: కాషాయానికి బండే విజయ సారథి.. సంజయ్‌పై అధిష్టానం ధీమా..