IPL – Sunrisers : ఐపీఎల్ లో తొలిసారి : సన్ రైజర్స్ మ్యాచ్ ఆపేశారు..!

ఐపీఎల్ లో శనివారం సాయంత్రం మొదటి మ్యాచ్ లక్నో, హైదరాబాద్ జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా 58వ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్ వద్దకు హైదరాబాద్ జట్టు అభిమానులు నట్లు, బోల్టులు విసిరేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

  • Written By: NARESH ENNAM
  • Published On:
IPL – Sunrisers : ఐపీఎల్ లో తొలిసారి : సన్ రైజర్స్ మ్యాచ్ ఆపేశారు..!

IPL – Sunrisers : ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో తొలిసారి మ్యాచ్ ఆపాల్సి వచ్చింది. శనివారం సాయంత్రం సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే, మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన అభిమానులు వ్యవహరించిన తీరు కారణంగా పది నిమిషాలపాటు మ్యాచ్ నిలిపివేయాల్సి వచ్చింది.

ఐపీఎల్ 16వ ఎడిషన్ దాదాపు ముగింపు దశకు వస్తోంది. ఒక్కో టీమ్ రెండు, మూడు మ్యాచ్ లు ఆడితే ప్లే ఆఫ్ దశకు టోర్నమెంట్ వెళ్లనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన మ్యాచ్ లను అన్ని జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆడుతున్నాయి. శనివారం కూడా సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. అయితే అభిమానులు చేసిన ఒక చిన్న పని వల్ల మ్యాచ్ 10 నిమిషాల పాటు వాయిదా వేయాల్సిన పరిస్థితి నిర్వాహకులకు ఏర్పడింది.

అసలు ఏం జరిగిందంటే..?

ఐపీఎల్ లో శనివారం సాయంత్రం మొదటి మ్యాచ్ లక్నో, హైదరాబాద్ జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా 58వ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్ వద్దకు హైదరాబాద్ జట్టు అభిమానులు నట్లు, బోల్టులు విసిరేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అక్కడ కూర్చున్న గంభీర్ వైపు చూస్తూ ప్రేక్షకులు ‘కోహ్లీ.. కోహ్లీ’ అంటూ నినాదాలు చేయడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురయింది. పరిస్థితి కొంత అదుపుతప్పినట్లు కనిపించడంతో నిర్వాహకులు మ్యాచ్ 10 నిమిషాలు పాటు నిలిపివేశారు. పరిస్థితి అదుపులోకి రావడంతో మళ్లీ మ్యాచ్ ను యధావిధిగా ప్రారంభించారు. అయితే, ఈ ఘటన పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలోనే అభిమానుల వల్ల ఒక మ్యాచ్ నిలిపేయడం తొలిసారి అని పలువురు పేర్కొంటున్నారు. ఈ తరహా పద్ధతులను అభిమానులు మానుకోవాలని సూచిస్తున్నారు.

సొంత మైదానంలో ఓడిపోయిన హైదరాబాద్ జట్టు..

ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనిమల్ ప్రీత్ సింగ్ 27 బంతుల్లో 36 పురుగులు, త్రిపాఠి 13 బంతుల్లో 20 పరుగులు, మార్క్రమ్ 20 బంతుల్లో 28 పరుగులు, క్లాసిన్ 29 బంతుల్లో 47 పరుగులు, అబ్దుల్ సమద్ 25 బంతుల్లో 37 పరుగులు చేయడంతో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది హైదరాబాద్ జట్టు. భారీ పరుగులు లక్ష్యంతో బరులోకి దిగిన లక్నో జట్టు సులభంగానే ఛేదించింది. క్వింటన్ డికాక్ 19 బంతుల్లో 29 పరుగులు, పెరాక్ మన్కడ్ 45 బంతులు 64 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మార్కస్ స్టోయినీస్ 25 బంతుల్లో 40 పరుగులు, నికోలస్ పూరన్ 13 బంతుల్లో 44 పరుగులు చేయడంతో లక్నో జట్టు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఓటమితో హైదరాబాద్ జట్టు దాదాపుగా ఐపీఎల్ నుంచి నిష్క్రమించినట్టు అయింది.

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు