మహారాష్ట్రలో `భోజన’ రాజకీయాలు
మహారాష్ట్రలో సుదీర్ఘకాలం మితపక్షాలుగా వ్యవహరించి, తాజాగా రాజకీయ ప్రత్యర్థులుగా మారిన శివసేన, బీజేపీలు పోటీ పడి ప్రజలకు చౌక ధరకు భోజనం అందిస్తున్నాయి. తద్వారా పేదలను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఆకలితో అలమటించే పేద ప్రజలకు తమ ప్రభుత్వం పసందైన భోజనం పెడుతుందని తొలుత ప్రకటించిన శివసేన సంకీర్ణ ప్రభుత్వం, చెప్పినట్లుగానే గణతంత్ర దినోత్సవం (జనవరి 26) రోజున రూ.10కే థాలీని (భోజనం) అందుబాటులోకి తెచ్చింది. అయితే మాజీ మిత్రపక్షమైన బీజేపీ ఒక అడుగు ముందుకేసి ‘మధ్యాహ్న […]
మహారాష్ట్రలో సుదీర్ఘకాలం మితపక్షాలుగా వ్యవహరించి, తాజాగా రాజకీయ ప్రత్యర్థులుగా మారిన శివసేన, బీజేపీలు పోటీ పడి ప్రజలకు చౌక ధరకు భోజనం అందిస్తున్నాయి. తద్వారా పేదలను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.
ఆకలితో అలమటించే పేద ప్రజలకు తమ ప్రభుత్వం పసందైన భోజనం పెడుతుందని తొలుత ప్రకటించిన శివసేన సంకీర్ణ ప్రభుత్వం, చెప్పినట్లుగానే గణతంత్ర దినోత్సవం (జనవరి 26) రోజున రూ.10కే థాలీని (భోజనం) అందుబాటులోకి తెచ్చింది.
అయితే మాజీ మిత్రపక్షమైన బీజేపీ ఒక అడుగు ముందుకేసి ‘మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది.
‘శివ భోజన్’ కంటే కూడా తమ భోజనం వంద రేట్లు బాగా ఉంటుందని బీజేపీ ప్రకటించింది. దీనికి `దీన్‌దయాల్’ థాలీ అని పేరు పెట్టింది. రూ.30కి అందించే ఈ మధ్యాహ్న భోజనం థాలీ (ప్లేట్)లో మూడు చపాతీలు, గినె్నలో అన్నం, రెండు ఆకు-కూరగాయల కూరలు, వేరు శనగ చట్నీ, మామిడి పచ్చడి ఇస్తామని బీజేపీ ప్రకటించింది.
కాగా గత నెల 26న శివసేన ‘శివ భోజన్’ పేరిట ప్రారంభించిన తాలీలో రెండు చపాతీలు, ఒక ఆకుకూర, 150 గ్రాముల అన్నం, పప్పు ఉన్నాయి.
ఇదిలాఉండగా తమ పార్టీలోని మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించినట్లు బీజేపీ వెల్లడించింది. తొలుత షోలాపూర్ జిల్లాలో పందర్‌పూర్‌లో గల పేరెన్నికగన్న విఠల్ ఆలయం వద్ద దీనిని ప్రారంభించింది. త్వరలో జిల్లా మొత్తం ఈ పథకాన్ని విస్తరిస్తామని పార్టీ ప్రకటించింది.