Flop Sequels In Tollywood: ఒక సినిమా హిట్ అయితే, ఆ సినిమాకి సీక్వెల్ రావడం ప్రస్తుతం ఆనవాయితీ అయిపోయింది. ఏ ఇండస్ట్రీ చూసినా.. ఏమున్నది గర్వకారణం, సినీ చరిత్ర సమస్తం, పరాయి కథల పరాయణత్వం అన్నట్టు ఉంది ప్రతి ఇండస్ట్రీ పరిస్థితి. ఈ క్రమంలోనే హిట్ సినిమాలు సీక్వెల్స్ గా వస్తున్నాయి. కొత్త కథలతో కుస్తీ పట్టి ఓడిపోవడం కంటే.. హిట్ కథలనే అటు ఇటుగా మార్చుకోవడం ఉత్తమం అని మేకర్స్ ఫిక్స్ అవుతున్నారు.
అయితే, భారీ అంచనాలతో రిలీజ్ అయ్యే ఈ సీక్వెల్స్ సక్సెస్ రేట్ అనేది.. హిస్టరీని బట్టి చూస్తే చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకుల ముందుకు సీక్వెల్స్ వస్తూనే ఉన్నాయి. మరి, భారీ అంచనాలతో వచ్చి ప్లాప్ అయిన సీక్వెల్స్ లిస్ట్ ఏమిటో తెలుసుకుందాం రండి.
ఆర్య – ఆర్య 2

Arya 2 movie
సుకుమార్ దర్శకత్వంలో ఆర్యకి సీక్వెల్ గా వచ్చిన ‘ఆర్య 2’ ప్లాప్ చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్, శ్రద్ధా దాస్ ముఖ్య పాత్రలు పొషించారు. ఐతే, ఈ చిత్రం మలయాళంలో ఇదే పేరుతో డబ్ అయ్యి, అక్కడ అఖండ విజయాన్ని సాధించింది.
మంత్ర – మంత్ర 2

Mantra 2 movie
తులసీ రామ్ దర్శకత్వంలో 2007 డిసెంబరు 14న విడుదలైన మంత్ర చిత్రం మంచి విజయాన్ని సాధించింది. శివాజీ, చార్మీ కౌర్ జంటగా వచ్చిన ఈ సినిమా ఛార్మి కెరీర్ లోనే స్పెషల్ ఫిల్మ్ గా నిలిచింది. ఐతే, మంత్రకి 2015 లో సీక్వెల్ గా వచ్చిన ‘మంత్ర 2’ ప్లాప్ అయ్యింది.
కిక్ – కిక్ 2

Kick 2 movie
రవితేజ సినీ కెరీర్ లోనే ‘కిక్’ సినిమా ప్రత్యేకంగా నిలిచింది. పైగా, ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. 2015 యాక్షన్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ‘కిక్ 2’ మాత్రం ప్లాప్ అయ్యింది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించాడు. కానీ, కళ్యాణ్ రామ్ కి భారీ నష్టాలు వచ్చాయి.
అవును – అవును 2

Avunu 2 movie
‘అవును’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. దాంతో పూర్ణ, హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రల్లో ‘అవును పార్ట్ -2’ పేరుతో సీక్వెల్ గా తీసుకొచ్చారు. రవి బాబు నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ భారీ పరాజయాన్ని ఎదుర్కొంది.
శంకర్ దాదా ఎంబిబిఎస్ – శంకర్ దాదా జిందాబాద్

Shankar Dada Zindabad movie
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సూపర్ హిట్ అయ్యింది. కానీ, శంకర్ దాదా జిందాబాద్ మాత్రం ప్లాప్ అయ్యింది. రెండవ పార్ట్ కి దర్శకులు మారడం వల్ల.. సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
సత్య – సత్య 2

Satya 2 movie
రాంగోపాల్ వర్మ రచన, దర్శకత్వం వహించిన సత్య చిత్రం గొప్ప విజయాన్ని సాధించింది. కానీ, శర్వానంద్ హీరోగా వచ్చిన సత్య 2 మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
మనీ – మనీ మనీ – మనీ మనీ మోర్ మనీ

Money Money More Money movie
మనీకి సీక్వెల్ వచ్చిన మనీ మనీ చిత్రమే ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. ఇక ఈ సినిమాకి థర్డ్ పార్ట్ ‘మనీ మనీ మోర్ మనీ’ అయితే ఇంకా డిజాస్టర్ అయ్యింది. మొత్తానికి ఈ మనీ సీక్వెల్స్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి.
గబ్బర్ సింగ్ – సర్దార్ గబ్బర్ సింగ్

Sardaar Gabbar Singh movie
‘గబ్బర్ సింగ్’ ఏ రేంజ్ హిట్టో కొత్తగా చెప్పక్కర్లేదు. 2016లో ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మాత్రం బాగా నిరాశ పరిచింది. విశేషం ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరించాడు.
మన్మధుడు – మన్మధుడు 2

Manmadhudu 2 movie
మన్మథుడు 2002 లో కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో విడుదలై ఘన విజయం సాధించింది. ఇక ఈ సినిమా సీక్వెల్ గా వచ్చిన ‘మన్మధుడు 2’ నాగ్ కెరీర్ లోనే అతిపెద్ద ప్లాప్ చిత్రంగా నిలిచింది.
గాయం – గాయం 2

Gaayam 2 movie
రామ్ గోపాల్ వర్మ – జగపతి బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘గాయం’ సినిమా ఆ రోజుల్లో అద్భుతమైన హిట్ ను అందుకుంది. ఐతే, ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ‘గాయం 2’ మాత్రం కనీస ఫలితాలను కూడా ఇవ్వలేకపోయింది.
ఎవడి గోల వాడిది – బురిడి

Buridi movie
ఈ రెండు సినిమాలు ఈవీవీ సత్యనారాయణ గారి దర్శకత్వంలోనే వచ్చాయి. ఐతే, ఎవడి గోల వాడిది సూపర్ హిట్. కానీ, ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన బురిడి మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది.
పోలీస్ స్టోరీ – పోలీస్ స్టోరీ 2

Police Story 2 movie
సాయి కుమార్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘పోలీస్ స్టోరీ’. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన పోలీస్ స్టోరీ 2 మాత్రం బిగ్ బిగ్గెస్ట్ ప్లాప్ అయ్యింది. మొత్తమ్మీద
సీక్వెల్స్ తెలుగు ఫ్లాప్ అయిన 13 తెలుగు సినిమాలు ఇవే..! లిస్ట్ లో టాప్ హీరోలు చాలామందే.!
Also Read:KGF 3 Update: ‘కేజీఎఫ్ 3’ ప్రకటించిన నిర్మాత.. ఎప్పుడు రాబోతుందో తెలుసా ?