WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ లలో ఒకటైన వాట్సాప్ కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు చెప్పింది. యూజర్లకు ప్రయోజనం చేకూరే విధంగా వాట్సాప్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. త్వరలో వాట్సాప్ కొన్ని కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయనుందని తెలుస్తోంది. వాట్సాప్ కొత్తగా అందుబాటులోకి తెచ్చే ఫీచర్లలో ఆడియో మెసేజ్ ప్రివ్యూ, ప్లేయర్, వాట్సాప్ కమ్యూనిటీ ఇతర ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ కొత్త ఫీచర్ల వల్ల వాట్సాప్ వినియోగం మరింత ఈజీ అవుతుందని సంస్థ చెబుతుండటం గమనార్హం. వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్ ద్వారా ఒకే రకమైన అభిప్రాయాలను కలిగి ఉన్న వ్యక్తులు అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ కు బదులుగా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ లో ఉండగా త్వరలో ఈ ఫీచర్ వాట్సాప్ యూజర్ల కోసం అందుబాటులోకి వస్తుంది.
వాట్సాప్ లో ప్లేయర్ అనే మరో కొత్త ఫీచర్ కూడా ఉండగా యూజర్లు ఈ ఫీచర్ సహాయంతో మెసేజ్ లను వింటూనే ఇతరులతో చాట్ చేసుకునే అవకాశం ఉంటుంది. త్వరలో వాట్సాప్ రెండు మొబైల్స్ లో ఉపయోగించుకునే అవకాశంను కల్పించనుంది. వాట్సాప్ అబౌట్ సెక్షన్ కు సంబంధించి కీలక మార్పులు చేయనుండగా యూజర్లు అనుమతించిన వాళ్లు మాత్రమే ప్రొఫైల్ ఫోటో, స్టేటస్ చూసే ఛాన్స్ అయితే ఉంటుంది.
మీడియా అన్ డూ బటన్, ఎమోజీ రియాక్షన్, ఆడియో మెసేజ్ ప్రివ్యూ ఇతర ఫీచర్లు కూడా వాట్సాప్ లో అందుబాటులో ఉన్నాయి. అవతలి వ్యక్తి కూడా ఎమోజీతో రిప్లై ఇవ్వడం ద్వారా ఎమోజీతో మెసేజ్ వచ్చినట్టు కనిపిస్తుంది. వాట్సాప్ లో పంపే ఆడియో మెసేజ్ లను సైతం రికార్డ్ చేసిన తర్వాత మార్పులు చేసే ఫీచర్ అందుబాటులో ఉంటుంది.