ఏపీలో తొలి కరోనా కేసు నెల్లూరులో ?
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి పాకింది. ఏపీలోని నెల్లూరు జిల్లా యువకుడికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. ఈ మధ్యే ఇటలీ నుంచి వచ్చిన యువకుడికి కరోనా ఉన్నట్లు తేలింది. దాంతో ఆ యువకుడు నివసించే ప్రాంతమైన చిన్న బజార్‌లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఆ ఏరియాను శుభ్రం చేసేందేకు శానిటరీ డిపార్ట్‌మెంట్ సమాయత్తమవుతుంది. వెంటనే ఆ యువకుడిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా […]

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి పాకింది. ఏపీలోని నెల్లూరు జిల్లా యువకుడికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది.
ఈ మధ్యే ఇటలీ నుంచి వచ్చిన యువకుడికి కరోనా ఉన్నట్లు తేలింది. దాంతో ఆ యువకుడు నివసించే ప్రాంతమైన చిన్న బజార్‌లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఆ ఏరియాను శుభ్రం చేసేందేకు శానిటరీ డిపార్ట్‌మెంట్ సమాయత్తమవుతుంది.
వెంటనే ఆ యువకుడిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకివ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చన తర్వాత ఎవరెవరితో తిరిగాడో వారందరి సమాచారం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.
కాగా.. అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దాంతో అతన్ని కూడా ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మరోపక్క కరోనా భయంతో రంగనాథస్వామి రథోత్సవాన్ని కూడా ఆపేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అయితే రథోత్సవం ఆపడం మంచిది కాదని.. కనీసం తూర్పుమాడ వీధులలోనైనా ఈ ఉత్సవాన్ని జరపాలని పండితులు నిర్ణయించారు.
ఇలా ఉండగా, ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్(కోవిడ్ 19) నిర్ధారణ కాలేదని నెల్లూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఆ వ్యక్తి శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలకు పంపామని తెలిపారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, కరోనా ఉందని తేలితే వైద్యం అందిస్తామని తెలిపారు.