Alien Signal: అంగారక గ్రహం నుంచి భూమికి రహస్య కోడ్: అది గ్రహాంతర వాసుల పనేనా?

గ్రహాంతర వాసులకు సంబంధించినదిగా భావిస్తున్న ఒక సీక్రెట్ కోడ్ అంగారక గ్రహం నుంచి భూమి మీదికి వచ్చింది. ఆ కోడ్ ను డి కోడ్ చేసే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు.

Alien Signal: అంగారక గ్రహం నుంచి భూమికి రహస్య కోడ్: అది గ్రహాంతర వాసుల పనేనా?

Alien Signal: మనుషుల్ని పోలిన మనుషులు ఉండడం సహజం. కానీ ఆ మనిషి పరిణామ క్రమం మాత్రం చాలా విచిత్రం. కోతి నుంచి హోమో సేపియన్స్ దాకా మనిషి ఎదిగిన విధానం నిజంగా ఆశ్చర్యం. అలా మనిషి ఎదిగి ఈ భూమి మీద ఉన్న సమస్త జీవులపై ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టాడు. కొండలను ఎక్కాడు. సముద్రం అంతు చూశాడు. మంచు శిఖరాగ్రాన తన విజయ జెండా పాతాడు. ఇక్కడితో ఆగలేదు. భూమి తన చుట్టూ తాను ఎందుకు తిరుగుతుందో తెలుసుకునే క్రమంలో ఏకంగా అంతరిక్షంలోకి వెళ్ళాడు.. అక్కడ భూమి గుట్టుమట్లు తెలుసుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేశాడు.. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ నుంచి కల్పనా చావ్లా వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయాన్ని కనిపెట్టారు. కనిపెడుతూనే ఉన్నారు. అయితే మనం ఇన్నాళ్లు అనుకున్న నవగ్రహాల్లో ఏదో ఒక గ్రహం నుంచి భూమికి ముప్పు పొంచి ఉందా? మనకు తెలియని గ్రహాంతరవాసులు మనల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే దీనికి అవును అనే సమాధానం ఇస్తున్నారు శాస్త్రవేత్తలు.

చాలావరకు హాలీవుడ్ సినిమాల్లో గ్రహాంతర నేపథ్యంతో తీసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అంటే వాటిలో లెక్కకు మిక్కిలి సినిమాటిక్ ఉండటం వల్ల ప్రేక్షకులు కూడా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. మరి ఇప్పుడు అవి నిజజీవితంలో జరిగితే? మనం ఇన్నాళ్ళూ నైట్ మెర్ లాగా ఊహించుకుంటున్న గ్రహాంతరవాసులు నిజంగా భూమి మీదకి వస్తే? వారు వస్తున్నట్టు కోడ్ ద్వారా సంకేతాలు పంపిస్తే? చదువుతుంటేనే భయం వేస్తుంది కదూ! ఇప్పుడు నిజంగానే ఇది జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గ్రహాంతర వాసులకు సంబంధించినదిగా భావిస్తున్న ఒక సీక్రెట్ కోడ్ అంగారక గ్రహం నుంచి భూమి మీదికి వచ్చింది. ఆ కోడ్ ను డి కోడ్ చేసే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు.. వాస్తవానికి మనుషుల్లాంటి వారు ఈ విశ్వంలో ఎక్కడైనా ఉన్నారా అనేది శాస్త్రవేత్తలను నిత్యం వెంటాడుతున్న ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు సమాధానంగా తొలిసారిగా అంగారక గ్రహం నుంచి భూమికి ఒక కోడ్ వచ్చింది. అనంత విశ్వం నుంచి అంగారక గ్రహానికి వచ్చిన కోడ్ ను గుర్తించిన ఓ ఆర్బిటర్..ఆ కోడ్ ను భూమికి పంపింది. మరి ఆ కోడ్ ఎలా వచ్చింది అనేది ఇప్పటికి ప్రశ్నార్థకమే? అంగారక గ్రహణం నుంచి అంగారక గ్రహం నుంచి భూమి మీదకు ఇప్పటివరకు అటువంటి కోడ్ ఎప్పుడూ రాలేదు. మరి ఆ కోడ్ పంపింది అంగారక గ్రహం మీద ఉన్న గ్రహాంతరవాసులో, ఇంకెవరో కాదు. అంగారక గ్రహం చుట్టూ తిరుగుతున్న ఒక ఆర్బిటర్ ఆ పని చేసింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఎగ్జో మార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ అంగారక గ్రహం చుట్టూ తిరుగుతోంది. అది బుధవారం రాత్రి 9 గంటలకు ఎన్ కోడ్ చేసిన మెసేజ్ కనిపెట్టింది. వెంటనే దానిని భూమికి పంపింది. 16 నిమిషాల తర్వాత ఆ సిగ్నల్ భూమికి చేరింది. అయితే మనుషులను పోలిన మనుషులు మరి ఎక్కడి నుంచో మెసేజ్ పంపిస్తే.. దాన్ని మనం అందుకుంటే.. అది నిజంగా ఒక అద్భుతమే. అయితే ఇప్పుడు పంపించిన మెసేజ్ కూడా అలాంటిదేనని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఇది గ్రహాంతరవాసులు పంపిందా? లేదా సుదూర ప్రాంతంలో ఏదైనా పేలుడు జరిగినందువల్ల వచ్చిందా అనేది తెలియదు.

అయితే వచ్చిన ఆ కోడ్ ను డీ కోడ్ చేయడమే అసలు సమస్య. మన భూమి పై ఉన్న ఎవరైనా కోడ్ క్రియేట్ చేస్తే.. దాన్ని డీకోడ్ చేయడం చాలా సులభం. అందులో ఏవైనా అక్షరాలు, నెంబర్లు కనుక ఉండి ఉంటే అవి మనకు తెలిసినవే ఉంటాయి. ఈ కోడ్ వచ్చింది విశ్వం నుంచి… దీన్ని ఎవరు పంపారో? ఎందుకు పంపారో తెలియదు. అందులో ఏం రాశారో కూడా చెప్పలేం. ఎందుకంటే వారి భాష మనకు రాదు.. అందువల్ల ఈ డీకోడ్ అనేది ఇప్పుడు పెద్ద సమస్య. అయితే దీనిని డి కోడ్ చేస్తామని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ దిశగా వారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు