పారామౌంట్ స్టూడియోలో అగ్నిప్రమాదం
తమిళలోని పెరంబూరు షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం వల్ల రూ. 20లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. సాలిగ్రామంలోని వేలాయుధం కాలనీలో పారామౌంట్ స్టూడియో ఉంది. ఇందులో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్‌లు రెగ్యూలర్ గా జరుగుతుంటాయి. ఇందుకోసం అవసరమైన సెట్స్‌ను పర్మినెంట్‌గా ఏర్పాటు చేశారు. ఈక్రమంలోనే పారామౌంట్ స్టూడియో శుక్రవాం ఉదయం సినిమా సెట్‌కు సంబంధించిన వస్తువుల నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన వాచ్‌మెన్ వెంటనే అగ్నిమాపక దళ కార్యాలయానికి […]

తమిళలోని పెరంబూరు షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం వల్ల రూ. 20లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. సాలిగ్రామంలోని వేలాయుధం కాలనీలో పారామౌంట్ స్టూడియో ఉంది. ఇందులో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్‌లు రెగ్యూలర్ గా జరుగుతుంటాయి. ఇందుకోసం అవసరమైన సెట్స్‌ను పర్మినెంట్‌గా ఏర్పాటు చేశారు.
ఈక్రమంలోనే పారామౌంట్ స్టూడియో శుక్రవాం ఉదయం సినిమా సెట్‌కు సంబంధించిన వస్తువుల నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన వాచ్‌మెన్ వెంటనే అగ్నిమాపక దళ కార్యాలయానికి సమాచారం అందించాడు. సకాలంలో ఫైరింజన్లు ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే అక్కడ వేసిన సెట్, సామాన్లు ప్రమాదంలో దగ్ధమైనట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం.
ఇటీవలే ఇండియన్-2 సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం జరిగింది. షూటింగ్ సమయంలో క్రేజ్ విరిగి కిందపడటంతో ముగ్గురు మృతిచెందగా పదిమంది గాయాలపాలయ్యారు. దర్శకుడు శంకర్, హీరో కమలాహాసన్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ సంఘటన గడువకముందే మరో ప్రమాదం జరగడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణనష్టం ఏమి జరగకపోవడంతో అంత ఊపిరి పిల్చుకున్నారు. ఇప్పటికైనా షూటింగ్ నిర్వాహాకులు ప్రమాదాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలని సినీప్రియులు కోరుతున్నారు.