Finland PM Sanna Marin Divorce: పెళ్లయిన మూడేళ్ళకే విడాకులు: వివాహ బంధానికి అందమైన ప్రధాని స్వస్తి
ఫిన్లాండ్ ప్రధాని సనామారిన్, మార్కస్ రైకోనెన్ తో 19 ఏళ్ల అనుబంధం ఉంది. వీరిద్దరూ చిన్నప్పటి నుంచే స్నేహితులు. కాలేజీ చదువు పూర్తి అయిన తర్వాత డేటింగ్ మొదలుపెట్టారు. 2

Finland PM Sanna Marin Divorce: ప్రేమ లేనిచోట ఏ బంధం నిలబడదు. అది పెద్దలు కుదిరిచిన వివాహమైనా, ప్రేమించి చేసుకున్న పెళ్లయినా అది మన లేదు. వ్యక్తిగత ఈగోలు ఎక్కువ అయిపోవడం, ఎదుటి మనిషి ఒక మాట అన్న కూడా సహించలేకపోవడం ఇవన్నీ బంధం బీటలు వారేందుకు కారణమవుతున్నాయి. ఒక్కసారి ప్రేమ స్థానంలో ద్వేషం మొదలైన తర్వాత ఇక ఆ బంధం అక్కడితోనే ముగిసిపోతోంది. ఇది మరొకసారి ఫిన్లాండ్ ప్రధాని ద్వారా నిరూపితమైంది. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో దేశ అత్యున్నత పదవి చేపట్టిన ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనామారిన్ వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్నట్టు చేసిన ప్రకటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఒక దేశ అత్యున్నత ప్రధాని అలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
19 ఏళ్లుగా కలిసే..
ఫిన్లాండ్ ప్రధాని సనామారిన్, మార్కస్ రైకోనెన్ తో 19 ఏళ్ల అనుబంధం ఉంది. వీరిద్దరూ చిన్నప్పటి నుంచే స్నేహితులు. కాలేజీ చదువు పూర్తి అయిన తర్వాత డేటింగ్ మొదలుపెట్టారు. 2019లో సనామారిన్ ఫిన్లాండ్ ప్రధానమంత్రి అయిన తర్వాత 2020లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందే వీరికి ఒక కుమార్తె ఉంది. ఇద్దరు సహజీవనం మొదలు పెట్టిన తర్వాత 2018లో సనామారిన్ ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. పెళ్లికి ముందే పిల్లలు కనడం ఫిన్లాండ్ లో సాధారణం. అయితే సనామారిన్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇద్దరు కూడా అన్యోన్యంగానే ఉన్నారు. అయితే గత కొంతకాలంగా దంపతుల మధ్య భేదాభిప్రాయాలు విడిపోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో తమ కుమార్తెకు మంచి తల్లిదండ్రులుగా ఉండాలని నిర్ణయించుకున్నారు.. ఈ క్రమంలోనే సనామారిన్ తన విడాకుల ప్రకటనను ఆన్లైన్ ద్వారా ప్రపంచానికి చెప్పారు.
ఫుట్ బాల్ ఆటగాడు
సనా మారిన్ భర్త మార్కస్ రైకోనన్ పేరుపొందిన ఫుట్బాల్ ఆటగాడు.. కాలేజీ రోజుల్లోనే అతగాడు ఫుట్ బాల్ ఆడేవాడు. అలా అతగాడు ఆటలో మరింత తర్ఫీదు ఉంది ఏకంగా ప్రొఫెషనల్ ఆటగాడు అయ్యాడు. ఇద్దరి వ్యాపకాలు వేరైనప్పటికీ పరస్పరం ప్రోత్సహించుకునేవారు. మార్కస్ రైకోనన్ ప్రోత్సాహం లేకుంటే తాను ప్రధానమంత్రిని కాలేకపోయేదాన్ని పలుమార్లు సనా మారిన్ చెప్పుకొచ్చింది. ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఇద్దరు పలు వేదికల్లో జంటగా దర్శనమిచ్చారు. పలు మ్యాగ్జిన్లు వీరిద్దరి ఫోటోలతో కవర్ పేజీలను ముద్రించాయంటే అతిశయోక్తి కాదు. ఇక సనామారిన్ సామాజిక మాధ్యమాల ద్వారా తమ విడాకుల ప్రకటన చేయడంతో అది ప్రస్తుతం వైరల్ గా మారింది. అన్నట్టు ఆమధ్య ఒక మ్యాగజిన్ చేసిన సర్వేలో ప్రపంచంలో అత్యంత అందమైన మహిళా ప్రధానిగా సనామారిన్ నిలవడం విశేషం.
