Fenugreek Benefits: మెంతులతో ఉండే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
ఒకప్పుడు కర్రీ వండేటప్పుడు జీలకరన్న, ఆనియర్, కరివేపాకు వేసేవారు. వీటితో పాటు కొన్ని కూరల్లో మెంతులను తప్పనిసరిగా వేసేవారు. కానీ నేటి కాలంలో మెంతుల వాడకం చాలా వరకు తగ్గింది.

Fenugreek Benefits: వాతావరణంలో వచ్చే మార్పులతో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో అనారోగ్యానికి గురవుతూ ఉంటారు ఈ క్రమంలో ఎనర్జీ కోసం వివిధ రకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అయితే ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకుంటే ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేటి కాలంలో చాలా మంది కూర వండేటప్పుడు కొన్ని పదార్థాలను స్కిప్ చేస్తున్నారు. దీంతో అవి అందించే ప్రయోజనాలను కోల్పోతున్నారు. కూరల్లో వాడడంతో పాటు నేరుగా వీటిని తీసుకుంటే బరువు సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంతకీ ఇంట్లో ఉండే ఆ పదార్థం ఏదో తెలుసా?
ఒకప్పుడు కర్రీ వండేటప్పుడు జీలకరన్న, ఆనియర్, కరివేపాకు వేసేవారు. వీటితో పాటు కొన్ని కూరల్లో మెంతులను తప్పనిసరిగా వేసేవారు. కానీ నేటి కాలంలో మెంతుల వాడకం చాలా వరకు తగ్గింది. వీటి రుచి చేదుగా ఉండడంతో పాటు కొందరు వీటిపై అవగాహన లేకపోవడంతో మెంతులను వాడడం లేదు. కానీ మెంతులు ఇచ్చే ప్రయోజనాల గురించి తెలిస్తే వాటిని అస్సలు విడిచిపెట్టరు. మార్కెట్లో ప్రతీ కిరాణ షాపుల్లో ఉండే ఈ మెంతుల్లో అనేక పోషకాలు ఉంటాయి.
మెంతుల్లో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. సాధారణంగా మెంతులను కొన్ని కూరల్లో వాడుతూ పచ్చళ్లల్లో తప్పనిసరిగా వాడుతూ ఉంటారు. ఇవి ఇన్ ఫ్లమేటరీ గుణాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల అస్తమా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ప్రతిరోజూ ఉదయాన్నే నానబెట్టిన మెంతులు తీసుకోవడం ద్వారా అసిడిటీ సమస్య తగ్గుతుంది. అలాగే మెంతుల నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది.
డయాబెటిస్ ఉన్న వారికి మెంతులు మంచి ఔషధంలా పనిచేస్తాయి. మెంతుల్లో రక్తంలోని చక్కెరస్థాయిలను తగ్గిస్తుంది. దీంతో షుగర్ కంట్రోల్ అవుతుంది. రోజూ ఖాళీ కడుపుతో మెంతుల నీటిని తాగొచ్చని కొందరు వైద్యులు సలహాలు ఇస్తున్నారు. ఇక మెంతులను నేరుగా తీసుకోవడానికి ఇబ్బంది పడేవారు ఆహార పదార్థాల్లో వేసుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.
