Police : మానవత్వం చాటుకున్న మహిళ సీఐ.. పోలీసులు
కొన్ని రోజుల క్రితం శ్రీశైలం కూతురు సాన్విక ఆరోగ్యం దెబ్బతిన్నది. వైద్యులను సంప్రదించగా భారీగా ఖర్చు అవుతుందని చెప్పారు. హోంగార్డుగా సంపాదిస్తున్న జీతంతో కుటుంబాన్ని పోషించలేక బాధపడుతున్న శ్రీశైలంకు సీఐ ధనలక్ష్మీ అండగా నిలిచింది.

Police Help : పోలీస్ పేరు చెప్పగానే 90వ దశకంలో భయపడేవారు. కానీ ప్రభుత్వాలు మారాయి. సమాజం మారింది. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ వచ్చేసింది. కరుకు పోలీసు వారు కూడా కాఠిన్యాన్ని వదిలి ప్రజలకు సేవ చేయడంలో ముందు ఉంటున్నారు. తమలో పనిచేసే తోటి పోలీసుల యోగక్షేమాలను కూడా వారు అడిగి తెలుసుకుంటున్నారు.
గోషా మహల్ ట్రాఫిక్ సీఐ ధనలక్ష్మీ తన గొప్ప మనసు చాటారు. తన స్టేషన్ లో హోంగార్డుగా పనిచేసిన శ్రీశైలం కూతురి వైద్యం కోసం రూ.1.85 లక్షల రూపాయలను జమ చేసి అందించారు. శ్రీశైలం గతంలో గోషా మహల్ ట్రాఫిక్ స్టేషన్ లో హోంగార్డుగా పనిచేశాడు. ఇటీవల బదిలీపై వేరే స్టేషన్ కు వెళ్లాడు.
కాగా కొన్ని రోజుల క్రితం శ్రీశైలం కూతురు సాన్విక ఆరోగ్యం దెబ్బతిన్నది. వైద్యులను సంప్రదించగా భారీగా ఖర్చు అవుతుందని చెప్పారు. హోంగార్డుగా సంపాదిస్తున్న జీతంతో కుటుంబాన్ని పోషించలేక బాధపడుతున్న శ్రీశైలంకు సీఐ ధనలక్ష్మీ అండగా నిలిచింది.
స్టేషన్ లోని సిబ్బంది అందరినీ సమావేశపరిచి తోచి సాయం చేయాలని సూచించింది. దీనికి స్పందించిన సిబ్బంది అంతా కలిసి లక్షా 85వేలు పోగు చేశారు. ఈ మొత్తాన్ని సీఐ ధనలక్ష్మీ స్వయంగా శ్రీశైలంకు ఆయన కూతురుకు అందజేశారు. శ్రీశైలం తనకు చేసిన సాయంపై కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు.
