ఈ శుక్రవారం విడుదల కాబోయే ఐదు సినిమాలివే..!

ఫిబ్రవరి 28 వ తేదీ శుక్రవారం ఐదు సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి. వీటిలో 2 డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. గత శుక్రవారం ఆరు సినిమాలు  విడుదల కాగా అందులో భీష్మ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ వారంలో ఏది బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధిస్తుందో వేచి చూడాలి…ఈ శుక్రవారం రిలీజ్ కాబోయే ఐదు సినిమాల వివరాలు ఇవే… 1. HIT: హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ […]

  • Written By: Raghava
  • Published On:
ఈ శుక్రవారం విడుదల కాబోయే ఐదు సినిమాలివే..!

ఫిబ్రవరి 28 వ తేదీ శుక్రవారం ఐదు సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి. వీటిలో 2 డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. గత శుక్రవారం ఆరు సినిమాలు  విడుదల కాగా అందులో భీష్మ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ వారంలో ఏది బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధిస్తుందో వేచి చూడాలి…ఈ శుక్రవారం రిలీజ్ కాబోయే ఐదు సినిమాల వివరాలు ఇవే…

1. HIT: హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా సస్పెన్స్ థ్రిల్లర్ “HIT” మూవీ రూపొందింది. రుహానీ శర్మ కథానాయిక కాగా వివేక్ సాగర్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ మూవీ పై అంచనాలు పెంచాయి.

2.లోకల్ బాయ్: సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా కిక్ బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా “లోకల్ బాయ్ ” మూవీ రూపొందింది. స్నేహ, మెహరీన్ కథానాయికలు కాగా నవీన్ చంద్ర, నాజర్ ముఖ్య పాత్రలలో నటించారు. “పట్టాస్” తమిళ మూవీ కి డబ్బింగ్ వెర్షన్ “లోకల్ బాయ్” మూవీ.

 

3. కనులు కనులను దోచాయంటే : వయాకామ్ 18 స్టూడియోస్, AJ ఫిల్మ్ కంపెనీ, DQ బ్యానర్స్ పై దేసింగ్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందిన తమిళ మూవీ “కన్నుమ్ కన్నుమ్ కొళ్ళైయాడితాళ్” తెలుగు డబ్బింగ్ వెర్షన్ ” కనులు కనులను దోచాయంటే” మూవీ 28వ తేదీ రిలీజ్ కానుంది .ఈ మూవీ లో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటించడం విశేషం.

 

4.స్వేఛ్చ: సరస్వతి డెవలపర్స్ సమర్పణ లో లచ్చు రామ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై KPN చౌహాన్ దర్శకత్వంలో సింగర్ మంగ్లీ ప్రధాన పాత్రలో రూపొందిన స్వేఛ్చ మూవీ 28 వ తేదీ రిలీజ్ కానుంది.

 

5 . రాహు: శ్రీ శక్తి స్వరూప్ క్రియేషన్స్ బ్యానర్ పై సుబ్బు వేదుల దర్శకత్వంలో అభిరామ్ వర్మ, కృతి గార్గ్ జంటగా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ “రాహు” మూవీ రూపొందింది. ఈ మూవీ కి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. “రాహు” మూవీ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

సంబంధిత వార్తలు