వేగంగా పోలవరం.. డిసెంబర్ 2021కి పూర్తి
పోలవరం.. ఏపీ కలల ప్రాజెక్టు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టును ఆయన కుమారుడే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టుదలతో పూర్తి చేయిస్తుండడం విశేషంగా మారింది. చంద్రబాబు హయాంలో ఏటీఎంలా మారిన పోలవరంను జగన్ గద్దెనెక్కాక టీడీపీ కాంట్రాక్టులను రద్దు చేసి ‘మేఘా’ చేతికి అప్పజెప్పింది. కాళేశ్వరంను మూడేళ్లలోనే పూర్తి మేఘా అదే పట్టుదలతో ఇప్పుడు పోలవరం పనులను పరుగులు పెట్టిస్తోంది. ప్రాజెక్టు చేపట్టినప్పటి నుంచి ఎక్కడా ఆపకుండా పూర్తి చేస్తోంది. […]

పోలవరం.. ఏపీ కలల ప్రాజెక్టు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టును ఆయన కుమారుడే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టుదలతో పూర్తి చేయిస్తుండడం విశేషంగా మారింది. చంద్రబాబు హయాంలో ఏటీఎంలా మారిన పోలవరంను జగన్ గద్దెనెక్కాక టీడీపీ కాంట్రాక్టులను రద్దు చేసి ‘మేఘా’ చేతికి అప్పజెప్పింది.
కాళేశ్వరంను మూడేళ్లలోనే పూర్తి మేఘా అదే పట్టుదలతో ఇప్పుడు పోలవరం పనులను పరుగులు పెట్టిస్తోంది. ప్రాజెక్టు చేపట్టినప్పటి నుంచి ఎక్కడా ఆపకుండా పూర్తి చేస్తోంది. కరోనా లాక్ డౌన్ లోనూ పనులు ఆపకుండా ముందుకు సాగింది. కూలీలను తీసుకొచ్చి మరీ పకడ్బందీగా చేస్తోంది. మొన్నటి వర్షాలకు వరదలు వచ్చినా ముందస్తుగానే గడ్డర్లు ఏర్పాటు చేసుకొని పనులు ఆగకుండా చూసుకుంది.
తాజాగా పోలవరంలో వేగంగా జరుగుతున్న పనుల పై పోలవరం ప్రాజెక్ట్ ఆథార్టీ (పీపీఏ) సంతృప్తి వ్యక్తం చేసింది. సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని బృందం పరిశీలించి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్పిల్ వే బ్రిడ్జి,గేట్ల ఏర్పాటు,ఎగువ కాపర్ డ్యాం పనులను,ఫిష్ లాడర్ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న విధానాన్ని ఇంజనీర్లు పీపీఏ బృందానికి వివరించారు. ఈ బృందం 2 రోజులు అక్కడే పర్యటించి వివిధ అంశాలపై పరిశీలించనున్నారు.
పోలవరంలో తాజాగా ఏర్పాటు చేసిన ఆర్మ్ గర్డర్స్ పరిశీలించిన చంద్రశేఖర్ అయ్యర్ పనుల తీరును ప్రశంసించారు. రేపు సాయంత్రానికి పోలవరం ప్రాజెక్ట్ లో తొలి గేట్ అమరుస్తున్నామని అయ్యర్ కి తెలిపిన పోలవరం ప్రాజెక్ట్ అధికారులు,మేఘా ఇంజనీరింగ్ నిపుణులు పనులను సకాలంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
పోలవరం పనులు పరిశీలించిన అనంతరం పీపీఏ సిఈఓ చంద్ర శేఖర అయ్యర్ మీడియా తో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని కితాబిచ్చారు. షెడ్యూల్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు. పనులు చాలా సంతృప్తికరంగా జరుగుతున్నాయని ప్రశంసించారు.
