Actress Regina: స్టార్ హీరోలు యాడ్స్ లో నటులు నటించడం అనేది ఎప్పటినుండో వస్తున్నదే. మొబైల్స్, కార్స్, డ్రెస్సెస్ , కిచెన్ అంటూ డిఫరెంట్ యాడ్స్ లో నటి నటులు తమదైన స్టైల్లో యాడ్ చేస్తున్నారు. మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, దీపికా , రణవీర్. అమితాబ్ బచ్చన్, సమంత, పలువురు యాడ్స్ కూడా చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఆయా వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్ లుగా కూడా నియమితులు అవుతున్నారు. యాడ్స్ కూడా క్రేజ్‌ని, ఇన్‌కమ్‌ని తెచ్చి పెట్టడమే కాక… ఒక్కోసారి వారి ఇమేజ్‌ని దెబ్బ తీయడమూ జరుగుతుంది. ఇప్పుడు రెజీనా విషయంలోనూ అదే జరుగుతోంది.
ఇటీవలే రెజీనా ఇన్‌స్టాలో ఒక ఫొటోని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో ఆమె చేతిలో మందు గ్లాస్ ఉంది సిగ్నేచర్ విస్కీ యాడ్ఇది.”తొమ్మిది సంవత్సరాల వయసులో యాంకరింగ్ మొదలుపెట్టాను. సినిమాలు,యాడ్స్ చేసే స్థాయికి వచ్చాను. నా ప్రయాణం, ఈ మూమెంట్స్ ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఈ క్షణాల్ని నేను సిగ్నేచర్‌తో సెలెబ్రేట్ చేసుకుంటాను”’ అని రెజీనా ఆ పోస్ట్ పెట్టారు. అయితే సోషల్ మీడియాలో ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. డబ్బుల కోసం ఇలాంటి పని చేస్తావా అని ఒకరు ప్రశ్నిస్తే… మీరిలా ఆల్కహాల్‌ని ప్రమోట్ చేయడం చూస్తుంటే సిగ్గేస్తోంది, మిమ్మల్ని అన్‌ఫాలో చేస్తున్నా అంటూ కొందరు కామెంట్స్ చేశారు.
టాలీవుడ్ స్టార్స్‌లో మహేష్ చేతిలో ఉన్నన్ని అడ్వటైజ్మెంట్ లు ఎవరి చేతిలోనూ ఉండవు. పాన్ మసాలా యాడ్ చేసినందుకు మహేష్‌బాబు లాంటి స్టార్ నే వదిలి పెట్టలేదు జనం. సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం యాడ్స్‌కి దూరంగా ఉండటానికి కారణం తప్పుడు ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేయకూడదనే. సెలెబ్రిటీస్ సిగరెట్స్, ఆల్కహాల్, గుట్కా లాంటి హానికర పదార్థాలను ప్రమోట్ చేయకపోవడమే బెటర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.