Bro Movie: బిగ్ బాస్ కంటెస్టెంట్ తో ‘బ్రో’ మొదటి పాట పాడించారా..! ఇంత కక్కుర్తి అవసరమా?
బ్రాండ్ న్యూ పోస్టర్ తో పవన్ కళ్యాణ్ ని ఎంతో స్టైలిష్ గా చూపిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసారు. ఫ్యాన్స్ నుండి ఆ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఈ పాట ని ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ తో పాడించారట. బిగ్ బాస్ సీజన్ 6 రన్నర్ గా నిల్చిన రేవంత్ , హౌస్ లోకి అడుగుపెట్టకముందు మంచి సింగర్, అందులో ఎలాంటి అనుమానం లేదు. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన పాటలు పాడాడు కూడా.

Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ చిత్రం ఈ నెల 28 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ మరియు టీజర్ ఫ్యాన్స్ కి మరియు ఆడియన్స్ కి బాగా నచ్చాయి.
కానీ సినిమా విడుదలకు పట్టుమని 20 రోజులు కూడా లేదు, ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన పాటలు విడుదల కాలేదని, అవి జనాల్లోకి రీచ్ అయితే ఈ సినిమా మీద హైప్ వస్తుందని, మేకర్స్ ఎందుకు ఈ సినిమా మీద ఇంత జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ ఫ్యాన్స్ ప్రతీ రోజు తమ ఫ్రస్ట్రేషన్ ని మేకర్స్ పై చూపిస్తూనే ఉన్నారు. అయితే మొత్తానికి అభిమానుల ఆర్తనాదాలను అర్థం చేసుకున్న మేకర్స్ మొత్తానికి ఈరోజు సాయంత్రం పాటని విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా నిన్న ఒక ప్రకటన చేసారు.
బ్రాండ్ న్యూ పోస్టర్ తో పవన్ కళ్యాణ్ ని ఎంతో స్టైలిష్ గా చూపిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసారు. ఫ్యాన్స్ నుండి ఆ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఈ పాట ని ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ తో పాడించారట. బిగ్ బాస్ సీజన్ 6 రన్నర్ గా నిల్చిన రేవంత్ , హౌస్ లోకి అడుగుపెట్టకముందు మంచి సింగర్, అందులో ఎలాంటి అనుమానం లేదు. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన పాటలు పాడాడు కూడా.
కానీ మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది. ఇక బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ కూడా బాగా తప్పింది. అలా ఫామ్ లోని ఒక సింగర్ తో పవర్ స్టార్ సినిమాకి పాటని పాడించడం అంత అవసరమా..?, తక్కువ రెమ్యూనరేషన్ కాబట్టి రేవంత్ కోసం మేకర్స్ ప్రయత్నం చేసారా వంటి సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. మరి ‘మై డియర్ మార్కండేయ’ అంటూ సాగే ఈ పాట ఎలా ఉండబోతుందో తెలియాలంటే మారియో రెండు గంటలు ఆగాల్సిందే.