Rozlyn Khan: బాలీవుడ్ నటి రోజాలిన్ ఖాన్ ఫ్యాన్స్ షాకయ్యే న్యూస్ చెప్పింది. తాను ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫోటో షోషల్ మీడియాకు షేర్ చేసి తనకు క్యాన్సర్ అని అనడంతో ఆడియన్స్ అంతా షాకయ్యారు. త్వరలో ‘బట్టతల మోడల్’ మీ ముందు ఉంటుందని చెప్పి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆమెకు క్యాన్సర్ వ్యాధి సోకడంపై నెట్టింట్లో పరామర్శల వర్షం కురిపిస్తున్నారు. రాబోయే ఏడు నెలల పాటు కీమో థెరపీ చేయించుకోనున్నట్లు చెప్పడం అందరినీ బాధేసింది. మోడల్ గా, సినీ నటిగా, టీవీల్లోనూ కనిపించిన రోజ్లిన్ ఖాన్ కు భయంకర వ్యాధి రావడంపై ఇండస్ట్రీ షాక్ కు గురయింది.

Rozlyn Khan
రోజాలిన్ ఖాన్ ప్రముఖ ముంబై నటి. మోడల్ గా తన జీవితాన్ని ప్రారంభించిన ఆమె మొదట్లో ఫ్రూటీ డ్రింక్, మొనాకో బిస్కెట్స్ ప్రొడక్స్ యాడ్స్ లో కనిపించింది. ఆ తరువాత 2012లో ‘దమా చౌక్డీ’ అనే సినిమాతో వెండితెరపై కనిపించింది. ఆ తరువాత ‘జీ లేనే దో ఏక్ పాల్’ అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఆ తరువాత బీ టౌన్ లో ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో టీవీ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ క్రమంలో ఆమెకు ‘క్రైం అలర్డ్’ అనే సీరియల్ లో నటించే అవకాశం వచ్చిందీ. ఈ సీరియల్ తోనే రోజ్లిన్ కు మంచి గుర్తింపు వచ్చింది.
ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. దీంతో ఆమెకు ఫాలోవర్స్ బాగానే పెరిగారు. తన అందచందాలను ఆరబోస్తూ కుర్రకారుకు మత్తెక్కించడంలో ఈ భామ చాలానే కష్టపడింది. దీంతో వెండితెరపై కాకుండా సోషల్ మీడియా తో ఫ్యాన్స్ ను అలరించిందీ భామ. అయితే మళ్లీ సినిమాల్లో నటించాలని చాలా మంది కోరారు. అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని చెబుతూ ఉండేది.కానీ ఇంతలో ఈ భామ ఆసుపత్రి నుంచి దిగిన ఫోటో చూసి అంతా షాక్ అయ్యారు.

Rozlyn Khan
తనకు క్యాన్సర్ నిర్దారణ అయినట్లు రోజాలిన్ ఖాన్ స్వ యంగా చెప్పింది. ఈ సందర్భంగా ఆమె ఓ ఎమోషనల్ మెసేజ్ పెట్టింది. ‘ నా జీవితం ఒక అధ్యాయం కావచ్చు.. ప్రతీ ఎదురుదెబ్బ నన్ను బలంగా మారుస్తుంది. నేను ప్రార్థించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నాకు అంతా మంచే జరుగుతుంది.. నా మెడ, వెన్నులో ఎలాంటి నొప్పి లేవు. కానీ ముందుగానే ఈ వ్యాధి గుర్తించబడింది’ అని రోజాలిన్ ఖాన్ తెలిపింది.