Kantara : ‘కాంతారా’ చూసి అనారోగ్యానికి గురైన ప్రముఖ నటుడు..ఇదెక్కడి విచిత్రం అండీ బాబోయి!

Kantara : గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన కన్నడ చిత్రం ‘కాంతారా’.KGF సిరీస్ తో పాన్ ఇండియన్ లెవెల్ లో తమ ప్రతిభ ని చాటుకున్న కన్నడ సినీ పరిశ్రమ , ఈ చిత్రం తో మరో మెట్టు ఎక్కింది..తెలుగు , తమిళం , హిందీ , కన్నడ మరియు మలయాళం అని తేడా లేకుండా విడుదలైన ప్రతీ భాషలో ప్రభంజనం సృష్టించింది ఈ సినిమా. ఈ […]

  • Written By: NARESH ENNAM
  • Published On:
Kantara : ‘కాంతారా’ చూసి అనారోగ్యానికి గురైన ప్రముఖ నటుడు..ఇదెక్కడి విచిత్రం అండీ బాబోయి!

Kantara : గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన కన్నడ చిత్రం ‘కాంతారా’.KGF సిరీస్ తో పాన్ ఇండియన్ లెవెల్ లో తమ ప్రతిభ ని చాటుకున్న కన్నడ సినీ పరిశ్రమ , ఈ చిత్రం తో మరో మెట్టు ఎక్కింది..తెలుగు , తమిళం , హిందీ , కన్నడ మరియు మలయాళం అని తేడా లేకుండా విడుదలైన ప్రతీ భాషలో ప్రభంజనం సృష్టించింది ఈ సినిమా.

ఈ చిత్రాన్నితియ్యడానికి చేసిన ఖర్చు కేవలం 15 కోట్ల రూపాయిలు మాత్రమే, కానీ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లు అక్షరాలా 420 కోట్ల రూపాయిలు..ఈ రేంజ్ వసూళ్లు వస్తాయని బహుశా ఈ చిత్ర దర్శక నిర్మాతలు కూడా ఊహించి ఉండరు.ఇందులో హీరో/డైరెక్టర్ రిషబ్ శెట్టి పనితనం గురించి ఎంత గొప్పగా చెప్పినా అది తక్కువే అవుతుంది.ఆయన దర్శకత్వ ప్రతిభని మెచ్చుకోవాల్నా?, లేదా యాక్టింగ్ స్కిల్స్ ని మెచ్చుకోవాల్నా?.

ఆయన ఎంత గొప్పగా నటించాడో,జనాల్లో ఆయన పోషించిన పాత్ర ఏ రేంజ్ ప్రభావం చూపించిందో ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూడబోతున్నాము..కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మంచి పాపులారిటీని తెచ్చుకున్న షైన్ శెట్టి ఇటీవల కాంతారా చిత్రం గురించి మాట్లాడుతూ ‘నా స్నేహితులందరూ కాంతారా చిత్రం చాలా బాగుంది చూడు అంటే చూసాను..ఆ సినిమాలో రిషబ్ శెట్టి నటన చూసి భయం వేసి జ్వరం వచ్చింది, వారం రోజుల వరకు తగ్గలేదు’ అంటూ చెప్పుకొచ్చింది.

నిజానికి క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటన చూసే ఆడియన్స్ కి ఆ రేంజ్ ఫీలింగ్ కలిగించింది అని చెప్పక తప్పదు.కచ్చితంగా నేషనల్ అవార్డు కి ఆయన అర్హుడు, మరి భారత దేశ ప్రభుత్వం ఆయనని గుర్తిస్తుందో లేదో చూడండి.ఇది ఇలా ఉండగా రిషబ్ శెట్టి త్వరలోనే కాంతారా చిత్రానికి ప్రీక్వెల్ తియ్యబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే, ఈ ఏడాది లోనే ఈ చిత్రం ప్రారంభం కాబోతుందట.

Tags

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు