Bigg Boss 6 Telugu- Revanth: బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం నుండి నేటి వరుకు టైటిల్ ని కొట్టే అవకాశం ఉన్న కంటెస్టెంట్ ఎవరు అంటే కళ్ళు మూసుకొని రేవంత్ అని చెప్పేవాళ్ళు ఆడియన్స్..ఎందుకంటే నామినేషన్స్ లోకి వచ్చినప్పుడల్లా రేవంత్ అందరికంటే భారీ మార్జిన్ తో అత్యధిక ఓట్లను దక్కించుకునేవాడు..ఈ వారం కూడా అతనే నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు కానీ, పడే ఓట్ల సంఖ్య మాత్రం బాగా తగ్గిపోయింది..ఇంతకు ముందు ఏ కంటెస్టెంట్ కూడా రేవంత్ కి వచ్చే ఓట్లతో పోలిస్తే దరిదాపుల్లో కూడా ఉండేవాళ్ళు కాదు.

Bigg Boss 6 Telugu- Revanth
కానీ ఇప్పుడు రేవంత్ కి నువ్వా నేనా అనే రేంజ్ పోటీని ఇస్తున్నాడు రోహిత్..వచ్చే వారం నుండి అతను రేవంత్ ని దాటివేసి నెంబర్ 1 స్థానం లో కొనసాగిన ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తున్నారు విశ్లేషకులు..రేవంత్ గ్రాఫ్ క్రమంగా తగ్గిపోవడానికి కూడా పలు కారణాలు ఉన్నాయి..ఎందుకంటే అతను ఓటమిని అసలు తీసుకోలేడు..ఓడిపోయినప్పుడల్లా సంచాలక్స్ మీద గొడవకి వెళ్లడం రేవంత్ కి అలవాటు అయిపోయింది.
ఇదే విషయాన్నీ ఈ వారం నామినేషన్స్ లో ఆదిరెడ్డి బాగా హైలైట్ చేసాడు..అతను చెప్పినట్టుగానే నిన్న టికెట్ 2 ఫినాలే టాస్కులో వైదొలగినప్పుడు సంచాలక్ గా వ్యవహరించిన శ్రీ సత్య తో గొడవ పడుతాడు రేవంత్..అప్పుడు శ్రీ సత్య కూడా ‘ఓటమి ని తీసుకోవడం నేర్చుకో రేవంత్..నువ్వు ఓడిపోతే పక్కవాళ్ళ మీద తోసేయడం కరెక్ట్ కాదు’ అని చెప్తుంది..అంతే కాకుండా ఈ వారం నామినేషన్స్ లో ఫైమా కూడా రేవంత్ ని బాగా ప్రాజెక్ట్ చేస్తుంది.

Rohit
మన ముందు ఒకలాగా మాట్లాడుతాడు..మన వెనుక ఒకలాగా మాట్లాడుతాడు ఇది ఎవరికీ కనిపించడం లేదా అని అంటుంది ఫైమా..రేవంత్ కూడా ఆమె మాటలకు తగ్గట్టుగానే ఈ వారం ప్రవర్తిస్తాడు..శ్రీహాన్ గురించి శ్రీ సత్య తో ఒకలాగా మాట్లాడి మళ్ళీ శ్రీహాన్ ముందు చాలా ఫ్రెండ్లీ గా ప్రవర్తిస్తాడు..అంటే రేవంత్ యాక్షన్ చేస్తున్నట్టే కదా..అని నెటిజెన్స్ చెప్తున్నమాట..మరోపక్క రోహిత్ మాత్రం గెలుపు ఓటములను ఒకేలాగా తీసుకుంటున్నాడు.
అనవసరపు గొడవలకు పోకుండా ఒక జెంటిల్ మ్యాన్ గా వ్యవహరిస్తున్నాడు..అతను నడుచుకుంటున్న తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది..వోటింగ్ కూడా బాగా పెరిగిపోయింది..ఇలాగే కనుక అతను ఆడితే కచ్చితంగా టైటిల్ గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.