Revanth Reddy : ఉచిత విద్యుత్‌, సీతక్క CM, రేవంత్ రెడ్డి CM అంశాలపై అసలు వివాదమేంటి?

అయితే కాంగ్రెస్ లో ఎస్సీలు, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తారా? సీతక్కకు డిప్యూటీ సీఎం ఇస్తారా? అని కొందరు ప్రశ్నించగా.. రేవంత్ సమాధానమిచ్చాడు. ‘సీఎంలు, అధ్యక్షులు అంతా బీసీలు, ఎస్సీలే.. సీతక్క డిప్యూటీ సీఎం ఏంటి? సీఎం కావచ్చు’ అంటూ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

  • Written By: NARESH
  • Published On:
Revanth Reddy : ఉచిత విద్యుత్‌, సీతక్క CM, రేవంత్ రెడ్డి CM అంశాలపై అసలు వివాదమేంటి?

Revanth Reddy : రేవంత్ రెడ్డి తానా మహాసభలపై తెలుగు మీడియాలో చర్చలే చర్చలే.. అసలు తానా సభల్లో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు.. దాని గురించి అసలు నిజాలు తెలుగు మీడియా కవర్ చేయడం లేదు. వక్రీకరించి అవాస్తవాలు ప్రచారం చేస్తోంది.

తానా మహాసభల్లో 9వ తేదీన జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పొలిటికల్ డెవలప్ మెంట్ ఇన్ తెలంగాణ అంశంపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. ముందుగా రేవంత్ ప్రసంగించారు. కొన్ని మంచి పాయింట్లు చెప్పాడు. కాంగ్రెస్ గురించి ఎక్కువగా చెప్పాడు.

రేవంత్ రెడ్డి అభిమానులుగా చప్పట్లు కొట్టొచ్చు కానీ రేవంత్ వేరు కాంగ్రెస్ వేరు కాదంటూ రేవంత్ క్లారిటీ ఇచ్చారు. రేవంత్ రెడ్డిపై ప్రధానంగా మూడు వివాదాస్పద అంశాలు అడిగారు. అందులో రెండు ఫోకస్ అయ్యాయి.

సీతక్క సీఎం అన్న రేవంత్ రెడ్డి మాటలనే తెలుగు మీడియా హైలెట్ అయ్యింది. కానీ దానికి ముందు పెద్ద తతంగం జరిగింది.. ‘రేవంత్ రెడ్డి మిమ్మల్ని సీఎంగా ఎప్పుడు చూస్తాం’ అని ఒక మహిళ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానం సీఎంను డిసైడ్ చేస్తుంది. సర్వేలు, ప్రజాభిప్రాయ సేకరణ చేసి పీసీసీ చీఫ్ ను చేశారని.. రేపు సీఎం పోస్ట్ కు అలానే చేస్తారని క్లారిటీ ఇచ్చారు. పాపులర్ ఎవరైతే వారే సీఎం అవుతారని స్పష్టం చేశారు.

అయితే కాంగ్రెస్ లో ఎస్సీలు, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తారా? సీతక్కకు డిప్యూటీ సీఎం ఇస్తారా? అని కొందరు ప్రశ్నించగా.. రేవంత్ సమాధానమిచ్చాడు. ‘సీఎంలు, అధ్యక్షులు అంతా బీసీలు, ఎస్సీలే.. సీతక్క డిప్యూటీ సీఎం ఏంటి? సీఎం కావచ్చు’ అంటూ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

ఉచిత విద్యుత్‌, సీతక్క CM, రేవంత్ రెడ్డి CM అంశాలపై రేవంత్ రెడ్డి ఏమన్నాడన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు. 

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు