
NTR 30
NTR 30: నాలుగున్నరేళ్లలో ఎన్టీఆర్ చేసింది ఒక్కటంటే ఒక చిత్రం. ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండేళ్లలో పూర్తవుతుంది అనుకుంటే రెట్టింపు సమయం పట్టింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ గాయాలపాలు కావడం, రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం వలన షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇక కరోనా ఎంట్రీతో దాదాపు ఓ ఏడాది కాలం లాక్ డౌన్ లో కలిసి పోయింది. అయినప్పటికీ రామ్ చరణ్ చక్కగా ప్లాన్ చేసుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ చేస్తూనే రెండు ప్రాజెక్ట్స్ ఆయన లైన్లో పెట్టాడు. ఆచార్య విడుదల కాగా, దర్శకుడు శంకర్ తో చేస్తున్న ఆర్సీ 15 సగానికి పైగా షూటింగ్ జరుపుకుంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో రామ్ చరణ్-శంకర్ మూవీ విడుదల కానుంది.
ఎన్టీఆర్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. దర్శకుడు కొరటాల శివతో ప్రకటించిన ఎన్టీఆర్ 30 కనీసం పట్టాలెక్కలేదు. ఈ క్రమంలో ఫ్యాన్స్ తీవ్ర అసహనంతో ఉన్నారు. ఎన్టీఆర్ పబ్లిక్ లోకి వస్తే చాలు… ఎన్టీఆర్ 30 అప్డేట్ అడుగుతూ విసిగించేస్తున్నారు. అమిగోస్, దాస్ కా ధమ్కీ చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఫ్యాన్స్ గోల ఎన్టీఆర్ ని ఆగ్రహానికి గురి చేసింది. మైక్ లో నేరుగానే తన కోపాన్ని ఎన్టీఆర్ బయటపెట్టారు.
కొరటాల మూవీ ఆలస్యం కావడానికి మరొక కారణం కూడా ఉంది. నిజానికి కొరటాల కంటే మూడు ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ తో మూవీ ప్రకటించారు. ఎందుకో గానీ ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారు. కొరటాల స్క్రిప్ట్ వినిపించడంతో ఆయనకు పచ్చజెండా ఊపారు. ఆచార్య ఫలితం చూశాక కొరటాల స్క్రిప్ట్ మీద నమ్మకం కోల్పోయిన ఎన్టీఆర్ మార్పులు చేర్పులు కోరారట. అందుకు మరి కొంత సమయం తీసుకుందట. ఇక ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలు జరిపి మార్చి నుండి రెగ్యులర్ షూట్ చేయాలని ప్రణాళిక వేశారు.

NTR 30
తారకరత్న మరణంతో ఆ ప్లాన్ అమలు కాలేదు. అలాగే మార్చి 12న లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఆస్కార్ వేడుకల్లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. నాలుగు రోజుల క్రితం ఎన్టీఆర్ ఇండియా వచ్చారు. ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఎన్టీఆర్ పూజా కార్యక్రమాలకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. మార్చి 23న ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. ప్రకటన పోస్టర్ అదిరింది. వెంటనే రెగ్యులర్ షూటింగ్ సైతం స్టార్ట్ చేస్తారట. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కి జంటగా నటిస్తుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Storm alert ⚠️#NTR30 Muhurtam on March 23rd 💥💥@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @sabucyril @YuvasudhaArts pic.twitter.com/hD7O9Kh675
— NTR Arts (@NTRArtsOfficial) March 18, 2023