YS Sharmila: అధికారాన్ని చెలాయించేందుకే రాజకీయాలు చేస్తారు.. ఇందుకు ఎవరు కూడా మినహాయింపు కాదు. మాకు అధికారం ముఖ్యం కాదు. ప్రజా సమస్యలపై ఉద్యమాలే తమకు ప్రథమ ప్రాధాన్యమని ఎవరైనా చెబితే ముమ్మాటి కమ్యూనిస్టులే అయి ఉంటారు.. ఎందుకంటే జనాల్లో వారు ఫేడ్ ఆవుటయి చాలా రోజులైంది కనుక. ప్రస్తుతం తెలంగాణలో వైయస్ షర్మిల పాదయాత్ర చేస్తున్నారు..మొన్న నర్సంపేటలో టిఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆ తర్వాత ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు ఇవ్వడం, ఆమె కారును పోలీసులు అడ్డుకోవడంతో కొంత ప్రాచుర్యం పొందారు. అదే ఊపులో ఇప్పుడు వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే మహిళా ముఖ్యమంత్రిని నేనే అంటూ ప్రకటిస్తున్నారు.

YS Sharmila
ఏమైంది షర్మిలకు
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి నేనే అని షర్మిల చెబుతుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. హైదరాబాద్ లో అరెస్టు వ్యవహారం తర్వాత షర్మిల లో నమ్మకం బాగా పెరిగిపోయిందని ఆమె సన్నిహితులు అంటున్నారు. మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో తెలంగాణకు తాను ముఖ్యమంత్రి కాకూడదని ప్రశ్నిస్తున్నారు.. ప్రజలు కూడా ఎప్పుడో సిద్ధమయ్యారని, తనను ముఖ్యమంత్రిని చేస్తారని ఆమె బలంగా నమ్ముతున్నారు. తాను కాంగ్రెస్ లేదా భారతీయ జనతా పార్టీలో చేరి ఉంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేవారని, కానీ ఇతర పార్టీల్లో చేరే కంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తనే సొంతంగా ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నానని, అందులో నుంచి పోటీ చేస్తానని షర్మిల చెబుతున్నారు.
కేఏ పాల్ కూడా..
వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు ఆయన ధాటికి సర్వం కోల్పోయిన వారిలో కేఏ పాల్ ఒకడు.. తన అల్లుడు అనిల్ కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పన్నిన ఉచ్చులో చిక్కుకుని ప్రభావాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ పెట్టి ఎన్నికలు ఎక్కడ జరిగినా పోటీ చేస్తున్నాడు. తానే కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం కూడా చేసుకుంటాడు.. షర్మిల కూడా ఇంచుమించుగా కేఏ పాల్ మాదిరి మాట్లాడుతున్నారు. కాకపోతే పాల్ మగ, షర్మిల ఆడ. అంతే తేడా. మిగదంతా సేమ్ టు సేమ్.
అంత స్థాయి ఉందా
ప్రస్తుతం రాష్ట్రంలో దూకుడు మీద ఉన్న భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరు.. షర్మిల మాత్రం తాను తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకుంటున్నారు.. వాస్తవానికి షర్మిల పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేదు. ఆమె తప్ప ప్రజా ఆకర్షణ ఉన్న నాయకులు ఎవరు కూడా ఆమె పార్టీలో లేరు.. ఇంతవరకు తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కడా కూడా షర్మిల పోటీ చేయలేదు. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉన్న పాలేరు నియోజకవర్గాన్ని వెతికి మరీ పట్టుకొని అందులో పోటీచేందుకు షర్మిల రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

YS Sharmila
అయినప్పటికి మీడియాకు ఆమె ఇస్తున్న ఇంటర్వ్యూలు చూసిన జనం నవ్వుకుంటున్నారు. ఆమెను పాల్ కేటగిరి లో చేర్చాలని కోరుతున్నారు. వాస్తవానికి తెలంగాణ సమాజం షర్మిల పార్టీని ఒక రాజకీయ పార్టీగానే పరిగణించడం లేదు.. ఆమె పాదయాత్రకు జనాలు స్వచ్ఛందంగా తరలి రావడం లేదు. తమను షర్మిల పాదయాత్రకు పిలిపించి, డబ్బులు కూడా ఇవ్వలేదని ఎంతోమంది కూలీలు ధర్నాలు చేసిన సంఘటనలు ఉన్నాయి.. కానీ ఇవేమీ పట్టించుకోకుండా, వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోకుండా తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి నేనే అనే షర్మిల ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది.. ఒక్క హైదరాబాద్ ఘటనతోనే తాను తెలంగాణ కు కాబోయే ముఖ్యమంత్రి అని ప్రకటించడం షర్మిల మానసిక
అపరిపక్వతకు నిదర్శనం. ఇప్పటికే రాష్ట్రంలో సంప్రదాయ పార్టీల ఆధారంగా ఓటర్లు ఎప్పుడో చీలిపోయారు. కనీసం క్షేత్రస్థాయి నిర్మాణం కూడా లేని తన పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందో షర్మిలకే తెలియాలి.