Older Model Cars: కార్లు ఆధునిక మానవ జీవన శైలిలో భాగమైపోయాయి. మార్కెట్లోకి ఎన్నో కార్లు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ కొన్నే మన మనసుల్ని గెలుచుకుంటాయి. అంత ఈజీగా మన స్మృతుల నుంచి తొలగిపోవు. మనతో పాటే వాటి స్మృతులు కూడా ప్రయాణం చేస్తాయి. అలాంటి కొన్ని కార్లు కాల గర్భంలో కలిసిపోయాయి. మరొకొన్ని ఆధునికత మేళవింపుతో మన ముందుకు రాబోతున్నాయి. అందుకు కారణమైన నూతన సాంకేతికతకు మనం కృతజ్ఞత చెప్పినా తక్కువే. వాటితో పెనవేసుకున్న బంధం అలాంటిది మరి.

Older Model Cars
కొన్ని దశాబ్ధాల క్రితం భారతీయ రోడ్ల పై కొన్ని కార్లు రారాజుగా వెలుగొందాయి. వినియోగదారుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. భారతీయ ఆటోమోటివ్ రంగాన్ని తిరుగులేని ఆధిపత్యంతో ఏలాయి. అలాంటి వాటిలో హిందూస్థాన్ అంబాసిడర్, టాటా సియర్రా, హిందుస్థాన్ కంటెస్సా, మారుతి 800, మారుతి ఓమ్నీ, మారుతి జిప్సీ మరియు జెన్ బ్రాండ్లు అగ్రభాగాన నిలుస్తాయి.
హిందుస్థాన్ అంబాసిడర్
అంబాసిడర్ కారు గురించి చెప్పాలంటే అదొక క్లాసిక్. డాబు దర్పానికి అదొక స్టేటస్ సింబల్. ఫ్యామిలీ రైడ్ మొదలుకొని.. వీఐపీ రైడ్ వరకు అంబాసిడర్ పెట్టింది పేరు. గతంలో అంబాసిడర్ కారు కనిపించని నగరం ఉండేది కాదు. అంతలా అంబాసిడర్ వినియోగదారుల్ని అల్లుకుపోయింది. ఈ కారును హిందూస్థాన్ ల్యాండ్ మాస్టర్ ఆధారంగా రూపొందించారు. 1956 నుంచి 2014 వరకు అంబాసిడర్ తయారీ కొనసాగింది. ఆ తర్వాత అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. అంబాసిడర్ కారు ఉత్పత్తిని ఆపేశారు. కానీ అంబాసిడర్ ప్రియులకు ఇదొక శుభవార్తగా చెప్పవచ్చు. త్వరలో అంబాసిడర్ కొత్త మార్పులతో ఎలక్ట్రిక్ కారుగా భారతీయ మార్కెట్లోకి రాబోతోంది. ఇందుకు సంబంధించిన సమాచారం మార్కెట్లో విస్త్రతంగా ప్రచారం జరుగుతోంది.

ambassador
హిందుస్థాన్ కంటెస్సా
హిందుస్థాన్ మోటర్స్ నుంచి వచ్చిన మరో కారు బ్రాండు హిందుస్థాన్ కంటెస్సా. 1984 నుంచి 2002 వరకు ఈ బ్రాండును ఉత్పత్తి చేశారు. దురదృష్టవశాత్తు కంటెస్సా బ్రాండ్ సేల్స్ తగ్గిపోయాయి. దీని కంటే మెరుగైన ఫ్యూయల్ ఎఫిషియంట్ కారు మోడల్స్ వివిధ కంపెనీల నుంచి వచ్చాయి. దీంతో కంటెస్సా శకం ముగిసిపోయింది. దీని ధర అప్పట్లో 4.84 లక్షల నుంచి 5.42 లక్షల వరకు ఉండేది. అయితే కంటెస్సా బ్రాండ్ మళ్లీ మార్కెట్లోకి వస్తోందన్న వార్తలు ఎక్కడా వినపడలేదు.

Hindustan Contessa
టాటా సియర్రా
టాటా సియర్రా భారతదేశంలోని మొదటి ఎస్యూవీ వాహనమని చెప్పవచ్చు. ఈ బ్రాండ్ టాటా టెల్కోలైన్ ను పోలి ఉంటుంది. కారు ముందు భాగము, ఇంజిన్ ను టాటా టెల్కోలైన్ నుంచే తీసుకున్నారు. దేశంలోని సాధారణ వినియోగదారుల కోసం టాటా సియర్రాను రూపొందించారు. సియర్రాకున్న మూడు డోర్ల డిజైన్, వెనుక ఉన్న ఆల్పైన్ విండోస్ అద్భుతమని చెప్పవచ్చు. టాటా సియర్రాను ఎలక్ట్రిక్ వెహికల్ గా తీసుకొస్తున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. 2024లో ఇండియా రోడ్లపై టాటా సియర్రా ఈవీ వాహనం రైడ్ తీస్తుందని చెప్పవచ్చు.

Tata Sierra
మారుతీ జిప్సీ
ఇది మరొక ఐకానిక్ ఎస్యూవీ వాహనమని చెప్పొచ్చు. పెట్రోలింగ్ నుంచి రోడ్డు పై వరకు ప్రతి ఒక్కరూ వినియోగించేటట్టు దీనిని రూపొందించారు. 4*4 డిజైన్, హై అండ్ లో గేర్లతో ఒక ప్రత్యేకమైన మోడల్ గా ఉండేది. 2018లో దీని ఉత్పత్తి ఆగిపోయినప్పటికీ సైన్యం దీనికి ఇంకా వాడుతోందని చెప్పవచ్చు. జిప్సీ మళ్లీ భారతీయ రోడ్ల పై రైడ్ తీయకపోవచ్చు. ఆ అవకాశం తక్కువే ఉంది. కానీ జిప్సీ స్థానంలో జిమ్నీ ఉంది. జిమ్మీని సైన్యం కూడా వాడనుందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.

Maruti Suzuki Gypsy
మారుతి 800
మారుతి సుజుకి 800 భారత మధ్యతరగతి ప్రజల కారుగా ప్రసిద్ధికెక్కింది. 1983 నుంచి 2014 వరకు దీని ఉత్పత్తి జరిగింది. సినిమాల్లో కూడా మారుతి 800ను బాగా వినియోగించేవారు. అప్పట్లో మారుతి 800 ఒక గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు. చిన్న చిన్న రోడ్ల పై కూడా సులువుగా రైడ్ చేయొచ్చు. మారుతి 800 సరసమైన ధర, ఇంధన సామర్థ్యం, దాని పై ఉన్న నమ్మకం ఎంతో మంది భారతీయ మధ్యతరగతి వర్గాలకు చేరువ చేసింది. అయితే మారుతి 800 మళ్లీ మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపించడంలేదు.

Maruti 800
సుజుకి జెన్
సుజుకి జెన్ మారుతి సుజుకి బ్రాండ్ గా మార్కెట్లోకి వచ్చింది. నడపడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే ఆ తర్వాత దీని స్థానంలో ఎస్టిలో బ్రాండ్ వచ్చింది. ఇదొక ఐకానిక్ వ్యాన్ అని చెప్పొచ్చు. సినిమాల్లోను, ట్యాక్సీగాను, అంబులెన్స్ గాను దీనిని ప్రతిచోట వాడేవారు. ఈ వాహనం సరుకు కూడా రవాణ చేసిందని చెప్పవచ్చు. దీనిని పర్యావరణ రహితంగా మార్చడానికి ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. కొన్ని రోజుల తర్వాత దీని ఉత్పత్తి ఆగిపోయింది. ఎలక్ట్రిక్ కార్ గా సుజుకి జెన్ బాగుంటుంది. కానీ మళ్లీ మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపించడంలేదు.

Suzuki Zen
మారుతి ఓమ్నీ
మారుతి ఓమ్మీ కారు చూడని వారు ఉండరు. అప్పట్లో సినిమాల్లో విరివిగా వాడేవారు. సినిమాల్లో విలన్లు కిడ్నాప్ లు చేయడానికి ఓమ్నీ కారునే వాడేవారు. అలా భారతీయులకు ఓమ్నీకారు సుపరిచితం. అంబులెన్స్ గా ఓమ్నీ కారును వాడేవారు. దీనికి కూడా పర్యావరణ రహిత మోడల్ గా తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. కానీ అది సాధ్యం కాలేదు. అయితే మారుతి ఓమ్నీ మళ్లీ మార్కెట్లోకి వస్తుందో రాదో తెలియదు.

Maruti Omni
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఈ సామెత కార్లకు కూడా వర్తిస్తుంది. అప్పట్లో ప్రజల మనుసుల్ని కొల్లగొట్టాయని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ పాత మోడల్స్ మార్కెట్లోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. కానీ వాటిలో కొన్ని మాత్రమే రూపుమార్చుకుని ఎలక్ట్రిక్ వెహికల్ గా రాబోతున్నాయి. పాత మోడల్స్ ను ఇష్టపడే వారికి ఇదొక శుభవార్త అని చెప్పొచ్చు.