ప్రపంచానికి 20-20 గండం!

చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా రక్కసి 2020వ సంవత్సరంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అయితే ఒక్కసారి చరిత్ర పుటల్లోకి తొంగిచూస్తే ప్రపంచానికి “20-20 గండం” ఉందనిపిస్తోంది. ప్లేగు మహమ్మారి నుండి ఇప్పటి కరోనా రక్కసి వరకు గమనిస్తే కొన్ని ఆసక్తికర నిజాలు బయటపడతాయి. ప్రతి వందేళ్లకు ఒకసారి ఏదో ఒక వైర‌స్ విజృంభించి ప్రపంచ దేశాలను వణికించి, లక్షల మందిని బలి తీసుకుంటున్నాయి అనేది నమ్మలేని నిజం. 1720లో ఫ్రాన్స్ లోని మార్సెయిల్స్ లో ఎలుకల నుంచి […]

  • Written By: Neelambaram
  • Published On:
ప్రపంచానికి 20-20 గండం!


చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా రక్కసి 2020వ సంవత్సరంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అయితే ఒక్కసారి చరిత్ర పుటల్లోకి తొంగిచూస్తే ప్రపంచానికి “20-20 గండం” ఉందనిపిస్తోంది. ప్లేగు మహమ్మారి నుండి ఇప్పటి కరోనా రక్కసి వరకు గమనిస్తే కొన్ని ఆసక్తికర నిజాలు బయటపడతాయి. ప్రతి వందేళ్లకు ఒకసారి ఏదో ఒక వైర‌స్ విజృంభించి ప్రపంచ దేశాలను వణికించి, లక్షల మందిని బలి తీసుకుంటున్నాయి అనేది నమ్మలేని నిజం.

1720లో ఫ్రాన్స్ లోని మార్సెయిల్స్ లో ఎలుకల నుంచి పుట్టిన  ప్లేగ్ మహమ్మారి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. యూరప్ ప్రజలను ఓ కుదుపు కుదుపేసి ఊర్లకు ఊర్లు ఊడ్చేసింది. లక్షల మంది చనిపోయారు. మరణించిన వారిని పూడ్చి పెట్టడం కష్టంగా మారి సామూహిక దహనాలు చేసారంటే పరిస్థితి ఎంత భయానకమో అర్థంచేసుకోవచ్చు.

యూరప్ ను అతలాకుతలం చేసిన ప్లేగుకు వందేళ్లు పూర్తవుతుండగానే ఆసియా దేశాలను 1820లో కలరా వ్యాధి కబళించింది. మన దేశంలోని కోల్ కతా నగరంలో బ్యాక్టీరియాతో కలుషితమైన చెరువు నీటిని తాగి ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. తొలిసారి ప్రబలి యూరప్ వరకు వ్యాపించింది. ఆసియా, యూరప్ ఖండాలను వణికించింది. లక్షమందికి పైనే చనిపోయారు.

ఇటీవల కాలంలో ప్రపంచానికి బాగా పరిచేయమైన పేరు స్పానిష్ ఫ్లూ. 1920లో స్పానిష్ ఫ్లూ వైరస్ వచ్చింది. యావత్ ప్రపంచాన్ని నివ్వరపరిచే విధంగా అత్యంత పెను విషాదాన్ని మిగిల్చిన అతిభయంకర వ్యాధి స్పానిష్ ఫ్లూ. ప్రపంచాన్ని విలవిలలాడేలా చేస్తూ 100 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడి, కోటి మంది మరణించారు. అతి పెద్ద విషాదం మిగిల్చిన భయంకరమైన వ్యాధిగా స్పానిష్ ఫ్లూ చ‌రిత్ర‌కెక్కింది.

2020లో కరోనా వైరస్ చైనాలోని వుహాన్ లో వెలుగుచూసింది. ఇప్పటి వ‌ర‌కు 80కి పైగా దేశాలకు వ్యాపించింది. చనిపోయిన వారి సంఖ్యా 3 వేలే అయినా ఇది పుట్టిస్తున్న భయం అంతా ఇంతా కాదు. లక్షల‌ మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోట్ల మంది ప్రజలు ఈ వైరస్ చంపుతుందోనని వణికిపోతున్నారు.

ఈ విధంగా 1720 నుండి 2020 వరకు ప్రతి వంద ఏళ్ళకి ఒక వైరస్/వ్యాధి ప్రపంచ దేశాలకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే స్వార్థంతో లేదా మరేదైనా ఆశించో కావాలనే వీటిని సృష్టించి జనం పైకి వదులుతున్నారా? అనే అనుమానం కూడా వస్తుంది. ఇంకా మున్ముందు ఎలాంటి వైరస్ లు, వ్యాధులు వస్తాయో కాలమే సమాధానం చెప్పాలి.