Anasuya Bharadwaj : అనసూయ రాను రాను మరింత క్రేజీగా మారిపోతుంది. తనలోని గ్లామర్ యాంగిల్ అంతకంతకు బయటకు తీస్తుంది. ఆమె ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి. యంగ్ అండ్ స్టైలిష్ గా కనిపించే ప్రయత్నం చేస్తుంది. కళ్ళకు కాంటాక్ట్ లెన్సులు పెట్టి కసి చూపులతో కవ్వించే ప్రయత్నం చేస్తుంది. తాజాగా కన్ను కొడుతూ బోల్డ్ ఫోజులతో ఇంటర్నెట్ ని షేక్ చేసింది. అనసూయ అవతారం చూసిన అభిమానులు వావ్ అంటుంటే… హేటర్స్ మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కాంటాక్ట్ లెన్స్ నీకు సెట్ కాలేదని ఒకరు. ఈ వయసులో ఇలాంటి ఫోజులు అవసరమా అంటూ మరొకరు కామెంట్స్ చేస్తున్నారు.
పర్ఫుల్ కలర్ టాప్, టోర్న్ జీన్స్ ధరించిన అనసూయ లుక్ అయితే కేక అని చెప్పొచ్చు. విజయవాడలో జరుగుతున్న ఓ ఈవెంట్ కోసం అనసూయ ఇలా సిద్ధమయ్యారట. అనసూయ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. అనసూయ తన వయసును తగ్గించుకొని అందాన్ని పెంచుకోవాలి అనుకుంటుంది. అందుకే ఎక్కువగా ట్రెండీ వేర్స్ లో సిద్ధం అవుతున్నారు. నిజంగా చెప్పాలంటే అనసూయకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారంటే నమ్మడం కష్టమే. ఆ రేంజ్ లో ఆమె గ్లామర్ ఉంది.
అనసూయ స్టార్ యాంకర్ కాకముందే వివాహం చేసుకున్నారు. ఆమెది లవ్ మ్యారేజ్. కాలేజ్ డేస్ లో పరిచయమైన భరద్వాజ్ తో అనసూయ లవ్ మేటర్ ఏళ్ల తరబడి నడిచింది. ఇంట్లో పెద్దలు ససేమిరా అన్నారు. దాంతో ఇంటి నుండి బయటకు వచ్చేసి చాలా కాలం అనసూయ హాస్టల్ లో ఉన్నారు. అనసూయ పట్టుదల ముందు వాళ్ళ నాన్న మొండితనం ఓడిపోయిందట. చివరకు భరద్వాజ్ తో పెళ్ళికి ఒప్పుకున్నాడట. అలా అనసూయ-భరద్వాజ్ ల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు సంతానంగా ఉన్నారు.
జబర్దస్త్ షోతో ఆమె పాపులారిటీ తెచ్చుకున్నారు. బోల్డ్ యాంకర్ గా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం అనసూయ నటిగా సెటిల్ అయ్యారు. టాలీవుడ్ బిజీ యాక్ట్రెస్ గా మారిపోయారు. ఏడాదికి అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తున్నారు. లేటెస్ట్ రిలీజ్ మైఖేల్ లో అనసూయ ఓ రోల్ చేశారు. పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. వాటిలో పుష్ప 2 ఒకటి. లేడీ విలన్ దాక్షాయణిగా డీగ్లామర్ రోల్ చేస్తున్నారు. కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు.