కరోనా కేసులపై ఈటెల గుడ్ న్యూస్

తెలంగాణ ప్రజలు కరోనా వైరస్‌ పై ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఈటెల తెలిపారు. వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఇద్దరి రిపోర్టులు కూడా నెగెటివ్‌ గా వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు.కాబట్టి వదంతలు, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని మంత్రి తెలియజేసారు. భారత్‌ లోనూ కరోనా ప్రభావం అంతగాలేదని చెప్పారు. గడిచిన నాలుగు రోజుల […]

  • Written By: Neelambaram
  • Published On:
కరోనా కేసులపై ఈటెల గుడ్ న్యూస్

తెలంగాణ ప్రజలు కరోనా వైరస్‌ పై ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఈటెల తెలిపారు. వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఇద్దరి రిపోర్టులు కూడా నెగెటివ్‌ గా వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు.కాబట్టి వదంతలు, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని మంత్రి తెలియజేసారు.

భారత్‌ లోనూ కరోనా ప్రభావం అంతగాలేదని చెప్పారు. గడిచిన నాలుగు రోజుల నుంచి ప్రజలు, అధికారులు ఎంతో సహకరించారని అన్నారు. రాబోయే రోజుల్లోనూ కరోనా వైరస్‌ ను తెలంగాణలోకి రాకుండా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషిని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుందన్నారు. అయితే ప్రజలకు మరింత అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి’ అని ఈటెల తెలియజేశారు.

సంబంధిత వార్తలు