KGF 2 : `కేజీఎఫ్’ నుంచి కాసేపట్లో అప్డేట్ రాబోతుంది. యష్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఉదయం 9గంటలకు ఓ అప్డేట్ రానుంది. సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్తో పాటు మరో కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కావాల్సి ఉంది. మరి కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అవుతుందేమో చూడాలి. ఇక షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

కాకపోతే, కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వకపోతే భారీ వసూళ్లు రావు. మరి వందల కోట్లు పెట్టి తీసిన సినిమాకి బిజినెస్ పరంగా న్యాయం జరగాలంటే.. కచ్చితంగా సోలో రిలీజ్ డేట్ ఉండాలి. సోలో డేట్ కోసం మేకర్స్ పక్కా ప్లాన్ తో ముందుకు పోతున్న క్రమంలో కరోనా మూడో వేవ్ వచ్చి పడింది. దాంతో ఇప్పుడు ‘కేజిఎఫ్ 2’కి సోలో రిలీజ్ అనేది అయోమయంలో పడింది. అసలు ఎప్పుడో ఈ సినిమా ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది.
అందుకే సమ్మర్ ను టార్గెట్ గా పెట్టుకుని రిలీజ్ కి సిద్ధమయ్యే లోపు, సెకెండ్ వేవ్ తో ‘కేజిఎఫ్ 2’కి భారీ దెబ్బ తగిలింది. ఇప్పుడు సమ్మర్ లాంటి మరో సీజన్ రావాలంటే.. ఇక మిగిలింది సంక్రాంతి సీజనే అనుకున్నారు. ఇప్పుడు అది పోయింది. ఇక మిగిలింది సమ్మరే. అయితే, సమ్మర్ కి ఆర్ఆర్ఆర్, తెలుగులో మహేష్, బన్నీ , మెగాస్టార్ ఇలా పెద్ద పెద్ద స్టార్స్ తమ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి కేజీఎఫ్ రిలీజ్ కష్టమే.