https://oktelugu.com/

Deepika Padukone: దీపికా మరీ ఇంత పచ్చిగా నటించింది ఏమిటి ?

Deepika Padukone: బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపికా పదుకొణె పెళ్లి తర్వాత కూడా బోల్డ్ సీన్స్ లో మొహమాటం లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోతుంది. ప్రస్తుతం గెహ్రాహియా అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌ బాగా ఆకట్టుకుంటుంది. అయితే, ట్రైలర్ లో గ్లామర్‌ డోస్‌ పెంచిన దీపికాను చూసి అందరూ షాక్ అయ్యారు. ఇదేమిటి ? దీపికా మరీ ఇంత పచ్చిగా రెచ్చిపోయింది ఏమిటి ? అంటూ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 22, 2022 / 10:20 AM IST
    Follow us on

    Deepika Padukone: బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపికా పదుకొణె పెళ్లి తర్వాత కూడా బోల్డ్ సీన్స్ లో మొహమాటం లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోతుంది. ప్రస్తుతం గెహ్రాహియా అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌ బాగా ఆకట్టుకుంటుంది. అయితే, ట్రైలర్ లో గ్లామర్‌ డోస్‌ పెంచిన దీపికాను చూసి అందరూ షాక్ అయ్యారు. ఇదేమిటి ? దీపికా మరీ ఇంత పచ్చిగా రెచ్చిపోయింది ఏమిటి ? అంటూ నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతూ కామెంట్స్ పెట్టారు.

    Deepika Padukone

    అసలు, రణవీర్‌ సింగ్‌ నటించిన 83 లో చిన్న పాత్రలో కనబడిన దీపికా పదుకొణె, దాదాపు రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయి పాత్రలో కనిపించింది గెహ్రాహియా సినిమాలోనే. ఇటీవలే ఆమె నటించిన ఈ గెహ్రాహియా సినిమా గురించి మాట్లాడుతూ.. ‘అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. అయితే, సెట్‌లో అందరి ముందు కోస్టార్స్‌తో రొమాంటిక్ సీన్స్‌లో నటించడం అంత ఈజీ కాదు.

    Also Read: స్విట్జర్లాండ్‌ లో ఎంజాయ్ చేస్తున్న సమంత !

    నిజానికి ప్రేక్షకులను ఆకర్షించడం కోసమే కాకుండా.. కథ కోసమే డైరెక్టర్ సీన్స్ క్రియేట్ చేశాడని యాక్టర్స్‌కి అనిపించినప్పుడే అలాంటి సీన్స్ చేయగలరు’ అని ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె చెప్పింది. దీపిక నటించిన ‘గెహ్రాహియా’ ఫిబ్రవరి 11న విడుదల కానుంది. ఈనేపథ్యంలో ఆమె సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ లో దీపిక బికినీ అవతారం, హాట్‌ లిప్‌ కిస్సులు ఫుల్ వైరల్ అవుతున్నాయి.

    మొత్తమ్మీద తన బోల్డ్ సీన్స్ తో అభిమానులకు దీపికా షాకిచ్చిందనే చెప్పాలి. ఇక ఫిబ్రవరి 11న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. మరి ట్రైలర్ లోనే తన బోల్డ్ సీన్స్ తో షాక్ ఇచ్చిన దీపిక, ఇక సినిమాలో ఏ రేంజ్ లో షాక్ ఇస్తోందో చూడాలి.

    Also Read: ఫిబ్రవరి 4న ‘బింబిసార’ వచ్చేస్తున్నాడు !

    Tags