Site icon OkTelugu

RGV: పూరి ఇంటికి ఆర్జీవీ పెట్టిన పేరేంటో తెలుసా..? అలా పెట్టడానికి కారణం ఏంటంటే..?

What was the name RGV gave to Puri Jagannadh house

What was the name RGV gave to Puri Jagannadh house

RGV: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకునే క్రమంలో చాలా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన పూరి జగన్నాథ్ కూడా మొదట్లో మంచి సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఆయన సినిమాల్లో చెప్పే డైలాగులు గాని, ఫైట్ సీక్వెన్స్ లు గాని, అన్ని చాలా కొత్తగా ఉండటమే కాకుండా యూత్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి.

అందువల్లే ఆయన యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకుడిగా మిగిలిపోయాడు. ఇక ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్(Puri Jagannadh) దాదాపు 30 కోట్లతో తన ఇంటిని చాలా గ్రాండ్ గా నిర్మించుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఆ ఇంట్లో అన్ని వసతులు, సౌకర్యాలు ఉంటాయి. ఇక ఇది ఇలా ఉంటే ఒకరోజు పూరి తన గురువు అయిన రామ్ గోపాల్ వర్మ ను తన ఇంటికి ఆహ్వానించాడట. ఆయన ఇల్లు మొత్తం తిరిగి చూసిన తర్వాత ఆ ఇంటికి ‘కేవ్ ‘ అనే పేరు పెట్టాడట. అది విన్న పూరి ఒకసారి షాక్ అయ్యాడంట.

అదేంటి కేవ్ అనే పేరు పెట్టారు అంటే అప్పుడు రామ్ గోపాల్ వర్మ దానికి వివరణ ఇస్తూ సింహాలు కేవ్ లోనే ఉంటాయి. దాంట్లో నుంచే బయటికి వస్తాయి. వేటాడుతాయి. దానికి కావాల్సిన మాంసం దొరికిన తర్వాత మళ్ళీ కేవ్ లోకి వెళ్తాయి. నువ్వు కూడా ఒక సింహం లాంటోడివే పూరి అని ఆయన పూరి గురించి చాలా గొప్పగా చెప్పాడట. దాంతో ఆయన చెప్పిన మాటలకు ఆశ్చర్య పోయిన పూరి వర్మ గారికి ఫిదా అయిపోయాడట. ఇక అప్పటినుంచి ఆ ఇంటికి ‘కేవ్ ‘ అనే పేరునే పెట్టాడు…

ఇక మొత్తానికైతే పూరి జగన్నాథ్ వాళ్ళ గురువు చెప్పిన పేరుని తన ఇంటికి పెట్టుకోవడం అలాగే ఆయన చెప్పిన బాటలోనే సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ముందుకు సాగడం అనేది ఒక మంచి విషయమనే చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ సైడ్ ట్రాకెళ్ళి సినిమాలు సరిగ్గా చేయలేకపోతున్నప్పటికీ, పూరి మాత్రం ఇప్పటికీ ఫామ్ లోనే ఉండి మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు…

Exit mobile version