Konda Movie: తెలంగాణలో తిరుగులేని నేతలు కొండా మురళి, సురేఖ. వారు అనుకున్నది చేస్తారు. పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళతారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వీరిని కలవాల్సిందే. కొండా దంపతుల గురించి రాష్ర్టంలో అందరికి తెలిసిందే. వారు రాజకీయాల్లో తమదైన శైలిలో రాణిస్తున్నారు. వీరి రాజకీయ జీవితంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. కొండా దంపతుల జీవిత కథ ఆధారంగా తీసే ఈ సినిమాలో ఏ రకమైన సన్నివేశాలుంటాయోనని అందరిలో ఆసక్తి నెలకొంది. కొండా దంపతుల జీవితం తెరిచిన పుస్తకమైన వారి వ్యక్తిగత విషయాలపై అందరు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

కొండా మురళి ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తి. ఎంతటి వారితోనైనా ఆయన ప్రవర్తన అలాగే ఉంటుంది. దీంతో కొండా సినిమా నిర్మాణంలో ఏ రకమైన సన్నివేశాలు జోడిస్తున్నారో అనే సందేహాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా టీఆర్ఎస్ లో ఉన్నా వారిది ఒకటే నైజం. ప్రజల పక్షం. ప్రజలతో సంబంధమే. దీంతో వీరి రాజకీయ జీవితంపై భిన్న కథనాలు వెలువడుతున్నా వర్మ మాత్రం ఏ స్థాయిలో తీస్తారో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.

Also Read: RGV Tweet: ఎన్టీఆర్ కి క్యాసినోకి లింక్ ఎలా.. ? వర్మ బాలయ్యకి ఏమి చెబుతాడో ?
రాంగోపాల్ వర్మ అంటేనే సంచలనాల కేంద్ర బిందువు. ఏం సంచలనాలు చేస్తారో అనే కొండా అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ సందర్భంగా కొండా మురళి తన మనసులోని మాట వెల్లడించారు. తాను ఎవరికి ఊడిగం చేయలేదని చెప్పారు. రాజకీయాల్లో విలువలు నశిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రాజకీయాల్లో తమ కుటుంబం ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడలేదని కుండబద్దలు కొట్టారు.
ఈ నేపథ్యంలో కొండా సినిమా నిర్మాణం త్వరలోనే పూర్తి కానుంది. దీనికి సంబంధించిన విషయాలు వర్మ సూచనప్రాయంగా చెప్పారు. కొండా దంపతుల కథకు మంచి గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విభిన్న కథాంశాలతో చిత్రాలు నిర్మించడం తనకు అలవాటేనని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ర్టంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై వర్మ తనదైన శైలిలో వివరించారు. ఆద్యంతం ఆసక్తికర సన్నివేశాలతో కొండా చిత్రం అందరి అంచనాలు అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: RGV: కొడాలి నానిని తలుచుకున్న ఆర్జీవీ.. మొత్తానికి తెలిసేలా చేశాడుగా..!