OTT Releases This Week: తెలుగు తెర పై భారీ చిత్రాల హడావుడి ఒకపక్క ముమ్మరంగా జరుగుతున్నా.. మరోపక్క మాత్రం ఓటీటీల సందడి తగ్గడం లేదు. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ ఆల్ రెడీ వచ్చేశాయి. కేజీఎఫ్, ఆచార్య వంటి భారీ సినిమాలు అన్నీ థియేటర్ రిలీజ్ కోసం ముస్తాబు అవుతున్నాయి. అయితే, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి,
అసలు ఈ కరోనా కాలంలో సినిమా రంగానికి ఏకైక ఆశా కిరణం నిలిచింది కూడా ఓటీటీలే. కరోనా క్లిష్ట సమయంలో ప్రేక్షకులను అలరించేది కూడా ఓటీటీలే. నష్టాల్లో నలిగిపోతున్న నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టేది కూడా ఓటీటీ సంస్థలే. పైగా ఓటీటీ సంస్థలు ప్రతివారం ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి వారం కొత్త కంటెంట్ తో వస్తోంది. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.
ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
సోనీలివ్ :
ఆడవాళ్లు మీకు జోహార్లు ఏప్రిల్ 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

ఎంఎక్స్ ప్లేయర్ :
దహనం ఏప్రిల్ 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

జీ 5 :
గాలివాన (వెబ్‌సెరిస్) ఏప్రిల్ 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

Also Read: RRR 18 రోజుల కలెక్షన్లు
ఆహా :
బ్లడీ మేరీ ఏప్రిల్15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

Also Read: అప్పటి ముచ్చట్లు : ఆ హీరోకి అన్యాయం చేసిన మెగాస్టార్ చిరంజీవి !