Site icon OkTelugu

Puri Jagannadh: పూరి జనగణమన పరిస్థితి ఏంటి..? ఎవరితో చేయాలనుకుంటున్నారు..?

What is the situation of Puri Jagannadh Jana Gana Mana movie

What is the situation of Puri Jagannadh Jana Gana Mana movie

Puri Jagannadh: ప్రతి సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్, ఫెయిల్యూర్ డైరెక్టర్స్ ఇద్దరు ఉంటారు. ఒక్కొసారి ఒకరికి సక్సెస్ వస్తే, మరొకరికి ఫెయిల్యూర్స్ వస్తాయి. ఇక ఇండస్ట్రీలో హిట్టు ఫ్లాపు అనేది సర్వసాధారణం. కానీ హిట్ ఇచ్చే కిక్కు వేరేలా ఉంటుంది, ఫ్లాపిచ్చే డిప్రెషన్ మరోలా ఉంటుంది. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు తీసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించి పెట్టాయి.

ఇక ప్రస్తుతం ఆయన పాన్ ఇండియాలో సినిమా చేస్తూ తనకంటూ భారీ క్రేజ్ ను సంపాదించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ ని సాధించిన ఆయన పాన్ ఇండియా సినిమాగా చేసిన ‘లైగర్ ‘సినిమాతో భారీ దెబ్బ తిన్నాడు. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే తను ఎప్పటినుంచో తీయాలనుకుంటున్న ‘జనగణమన ‘ సినిమాని ఇప్పటివరకు తీయలేకపోయాడు. ఆ మధ్యలో విజయ్ దేవరకొండ తో ఈ సినిమా ఓపెనింగ్ కూడా జరిపారు. కానీ లైగర్ ప్లాప్ తో ఈ సినిమా పట్టలెక్కలేదు.

ఇక ఇప్పుడు ఈ సినిమాను పూరి జగన్నాథ్ తీసే ఆలోచనలో ఉన్నాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిజానికైతే ఈ సినిమాను మహేష్ బాబు తో చేయాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల అది మిస్సయింది. ఇక దాంతో విజయ్ దేవరకొండ తో చేస్తున్నాడు అనుకున్నప్పటికీ అది కూడా ఆగిపోయింది. మరి ప్రస్తుతం ఈ సినిమాని పూరి జగన్నాథ్ చేసే ఉద్దేశంలో ఉన్నాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఈ సినిమాని పట్టాలెక్కిస్తే ఎవరితో చేస్తాడు. ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో పూరీకి స్టార్ హీరోలు డేట్స్ ఇస్తారా, లేకపోతే టైర్ టు హీరోలతో ఈ సినిమాని చేసేస్తాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఇక ‘డబుల్ ఇస్మార్ట్ ‘ సినిమాతో కనక సక్సెస్ సాధిస్తే స్టార్ హీరోలు సైతం పూరీకి డేట్స్ ఇస్తారు అనే కాన్ఫిడెంట్ తోనే పూరి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు చేస్తున్న సినిమాతో సక్సెస్ కొట్టి జనగణమన సినిమాని సెట్స్ మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలైతే చేస్తున్నాడు…

Exit mobile version