Allu Arjun: సిద్ధార్థ్, షామిలీ జంటగా ఆనంద్ రంగ దర్శకత్వంలో 2009లో వచ్చిన సినిమా ఓయ్. ఈ సినిమా మ్యూజికల్ గా, కథ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. కానీ ఓయ్ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఓయ్ సినిమా పాటలు వింటూనే ఉంటారు. సినిమా రిలీజైన 15 సంవత్సరాల తర్వాత అంటే వాలెంటైన్స్ డేకి ఫిబ్రవరి 14న ఓయ్ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్.
ఇక ఓయ్ సినిమా రీరిలీజ్ తో ఓయ్ డైరెక్టర్ ఆనంద్ రంగ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఓయ్ సినిమా గురించి పోస్టులు పెడుతున్నారు. అంతే కాదు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తున్నారు. తాజాగా ఓయ్ సినిమా గురించి ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు ఆనంద్. ఈ పోస్ట్ లో ఓయ్ సినిమా గురించి డీటైలింగ్ ఇచ్చారు. సాధారణంగా ఓయ్ ఇంగ్లీష్ లో రాయాలంటే oye అని రాస్తాము. కానీ ఈ సినిమా టైటిల్ లో oy అని మాత్రమే ఉంటుంది.
ఓయ్ సినిమా ఫిబ్రవరి 14న రీరిలీజ్ అవుతుంది. ఎవరైనా రివ్యూయర్ ఈ సినిమాలో ఒక చిన్న విషయాన్ని గమనించారా? నేను చెప్తాను ఓయ్ సినిమా గురించి అంటూ మొదలు పెట్టారు. ఈ స్క్రిప్ట్ ను సొంతంగా రాసుకున్నాను అంటూ.. సినిమాలో సంధ్య ఉదయ్ ని ఓయ్ అని పిలుస్తుంటుంది. సాధారణంగా ఇలా బయట చాలా మంది పిలుస్తారు. ఈ సినిమాలో ఉదయ్ లవ్ స్టోరీ తన బర్త్ డే రోజు 1 జనవరి 2007న సంధ్యని చూడడంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత సంక్రాంతికి ఉదయ్ తండ్రి చనిపోతారు.
సంధ్య వాలెంటైన్ డే రోజు గులాబీలతో మాట్లాడుతుంది. ఆ తర్వాత సినిమాలో ఒక హోలీ సీక్వెన్స్ వస్తుంది. ఆ తర్వాత సమ్మర్ వెకేషన్ కి పిల్లలు సంధ్య దగ్గరికి వస్తారు. షిప్ లో వినాయక చవితి ఎపిసోడ్ ఉంటుంది. తర్వాత సంధ్య ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. మళ్లీ సంవత్సరానికి అంటే 1 జనవరి 2008కి సంధ్య చనిపోతుంది. అంటే హీరో ప్రేమ కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. అంటే one year ను షార్ట్ కట్ లో oy అని పెట్టాను అని తెలిపారు డైరెక్టర్. ఇంత చిన్న టైటిల్ లో ఇంత పెద్ద కథ ఉంది అన్నమాట.
ఇక ఈ టైటిల్ గురించి చెప్తూ.. మొదట ఈ ఓయ్ టైటిల్ ను అల్లు అర్జున్ పరుగు సినిమాకు పెట్టమని చెప్పారట. పరుగు సినిమాలో హీరో హీరోయిన్స్ కి వచ్చే కొన్ని సీన్ లలో హీరో ఓయ్ అని పిలుస్తారని.. ఆ టైటిల్ చెప్పారట. కానీ ఆ టైటిల్ ను రిజక్ట్ చేశారట. ఇక ఈ టైటిల్ తోనే కథ రాసుకున్నారట డైరెక్టర్. ఇలా ఈ డైరెక్టర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.