Rajamouli: రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలిస్తే ఆశ్చర్య పోతారు…

తెలుగులో తన సత్తా చాటుకున్న రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియాలో తన దమ్ము ఏంటో చూపించాడు. ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ లో రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నాడు.

Written By: Gopi, Updated On : March 21, 2024 1:08 pm

What is Rajamouli success secret

Follow us on

Rajamouli: శాంతినివాసం సీరియల్ తో డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమైన రాజమౌళి ఆ సీరియల్ సూపర్ సక్సెస్ అవ్వడంతో, జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) హీరోగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా చేశాడు. ఈ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకొని డైరెక్టర్ గా కూడా తన హవాని కొనసాగించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ఫెయిల్యూర్ కూడా లేని దర్శకుడిగా ఎదిగాడు.

ఇక అలాగే తెలుగులో తన సత్తా చాటుకున్న రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియాలో తన దమ్ము ఏంటో చూపించాడు. ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ లో రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో చాలామంది బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సక్సెస్ కి సీక్రెట్ అంటూ ఏమీ లేదు. దాదాపు ఒక సినిమా కోసం రోజుకు 18 గంటలు కష్టపడతానని, అనుక్షణం సినిమా గురించే ఆలోచిస్తూ ఉంటానని చెప్పాడు.

బహుశా అదే తన సక్సెస్ సీక్రెట్ ఏమో అని తను చెప్పడం విశేషం…ఇక ఇదిలా ఉంటే ఆయన సక్సెస్ సీక్రెట్ గురించి కొంతమంది సినీ మేధావులు సైతం మాట్లాడుతూ ఆయన ఒక సినిమా స్టోరీలో ముందుగా సబ్ ప్లాట్స్ ని చాలా క్లియర్ గా వేసుకొని, దాంట్లో హై ఎమోషన్స్, ఎలివేషన్స్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాడు. ఇక స్క్రీన్ ప్లే రాసేటప్పుడు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఎమోషన్ ని అప్ అండ్ డౌన్స్ చేసుకుంటూ ప్రేక్షకుడి ఎమోషన్స్ తో ఆడుకుంటాడు. అందుకే రాజమౌళి సినిమాలకి ఉన్న క్రేజ్ మరే సినిమాలకి ఉండదని చాలామంది విమర్శకులు సైతం చెబుతూ ఉంటారు.

అలాంటి ఒక స్ట్రాటజీతో మరి మిగతా డైరెక్టర్లు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారనేదే ఇక్కడ పెద్ద చర్చ గా మారింది. ఇక మొత్తానికైతే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ మన తెలుగు వాడు అయినందుకు మనందరం గర్వించాలి…ఇక దానికి తోడు గా ఈసారి తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు ప్రపంచవ్యాప్తం గా వినిపించబోతున్నట్టుగా తెలుస్తుంది…