Vishal saamanyudu movie trailer released : తమిళ స్టార్ హీరో విశాల్, డింపుల్ హయతి జంటగా నటించిన కొత్త సినిమా ‘సామాన్యుడు’. కాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. మరి ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా నుంచి వచ్చిన ఈ ట్రైలర్ చాలా బాగుంది. ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అనే ఉపశీర్షికతో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ చాలా బాగా ఆకట్టుకుంది. ట్రైలర్ ను చూస్తుంటే ఇదొక ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది. మీకు ఒక మంచి క్రైమ్ స్టోరీ చెప్పనా అంటూ విశాల్ వాయిస్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.
కాగా ఈ సినిమాలో రొమాంటిక్ అంశాలు ఉన్నప్పటికీ అంతకుమించి యాక్షన్ సీన్లు ఉన్నాయట. ట్రైలర్ లో దాన్నే బాగా ఎలివేట్ చేశారు. ఇక సమాజంలో రెండు రకాల మనుషులు ఉంటారని చెప్పడం, అలాగే నేరస్థుడి పుట్టుక వంటి డైలాగ్ లు కూడా బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఇతర సంభాషణ కూడా డీసెంట్ గా ఉన్నాయి. యాక్షన్, ఎమోషనల్ సీన్లలో విశాల్ ఎప్పటిలానే చాలా బాగా చేశాడు.
యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు ప్లస్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ట్రైలర్ లో కూడా తన మార్క్ ను చూపించడం బాగుంది. ముఖ్యంగా యువన్ బీజీఎం అదిరిపోయింది. ఇక విశాల్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్ గాచాలా బాగా సెట్ అయింది. అదే విధంగా కవిన్ రాజా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాలో యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పీఏ తులసి నటించారు.
విశాల్ తన సొంత బ్యానర్ ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’పై నిర్మిస్తున్న ఈ సినిమా చాలా బాగా ఆకట్టుకునేలా ఉంది. ఇక తెలుగు, తమిళం రెండు భాషల్లో విడుదల కానుంది ఈ సినిమా. ఏది ఏమైనా తమిళ స్టార్ హీరో విశాల్ ఎప్పుడూ విభిన్నమైన సినిమాలే చేస్తుంటాడు. అందుకే విశాల్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా పలు మంచి సినిమాలను చేశాడు.
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More