Site icon OkTelugu

Vikram Thangalaan: విక్రమ్ తంగలన్ సినిమాతో మాస్టర్ ప్లాన్ వేశాడుగా… సక్సెస్ అవుతుందంటారా..?

Vikram made a master plan with Thangalaan Movie

Vikram made a master plan with Thangalaan Movie

Vikram Thangalaan: సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు విక్రమ్…ఈయన చేసిన ప్రతి సినిమాలో తన క్యారెక్టర్ ను కొత్తగా ప్రజెంట్ చేస్తూ వైవిధ్యమైన పాత్ర లను ఎంచుకుంటూ సినిమాని సక్సెస్ చేస్తూ ఉంటాడు. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది అనగానే అది విక్రమ్ తప్ప మరెవరు చేయలేరు అనేంతలా గొప్ప గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.

ఇక ఇప్పుడు అందులో భాగంగానే పా రంజిత్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరోసారి చాలా వైవిధ్యంగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాతో ఆయనకు దాదాపు ఆస్కార్ అవార్డు వస్తుందేమో అనేంతలా తన బాడీ ని ఫిజికల్ గా మౌల్డ్ చేసుకున్న విధానం అయితే చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఇక తొందర్లోనే ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ డూపర్ సక్సెస్ సాధించాలనే ఉద్దేశ్యంతో అటు డైరెక్టర్ పా రంజిత్, ఇటు హీరో విక్రమ్ ఇద్దరు మంచి ధృడ సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ విపరీతమైన అటెన్షన్ ని క్రియేట్ చేసుకోగా, ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఒక వర్గం ప్రేక్షకులైతే అసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో విక్రమ్ మరొక డిఫరెంట్ అటెంప్ట్ చేసి సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన అపరిచితుడు, నాన్న లాంటి సినిమాల్లో అద్భుతమైన నటనను కనబరిచి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు…

ఇక ఇప్పుడు కూడా అలాంటి సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నాడు. ఇక దాంతో పాటుగా ఇప్పుడు ఆస్కార్ అవార్డు మీద కన్నేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే శివపుత్రుడు సినిమాకు గాను విక్రమ్ కు ‘నేషనల్ అవార్డు’ వచ్చిన విషయం మనకు తెలిసిందే…మరి విక్రమ్ అనుకున్నట్టుగానే ఆయనకి ఈ సినిమాతో మంచి గుర్తింపు తో పాటు ‘ఆస్కార్ అవార్డు’ కూడా వస్తుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Exit mobile version