Site icon OkTelugu

Nayanthara Marriage: నయనతార పెళ్లి వేదిక, ముహూర్తం డిటైల్స్ ఇవే !

Nayanthara Marriage

Nayanthara, Vignesh Shivan

Nayanthara Marriage: నయనతార పెళ్లి పై గత కొన్ని సంవత్సరాలుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఐతే, నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఆ పుకార్లకు ఇక రెడ్ సిగ్నల్ పడినట్టే. నయనతార తన ప్రియుడు విగ్నేష్ శివన్ ను వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతుంది. వేదిక‌తో పాటు ముహూర్తం కూడా ఫిక్స‌యిపోయ్యింది. జూన్ 9న రాత్రి 10 గంటలకు న‌య‌నతార పెళ్లి తిరుప‌తిలో జ‌రగ‌బోతోంది. అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా నయనతార అభిమానులు మాత్రం ఈ వార్తను నమ్మలేకపోతున్నారు.

vignesh shivan and nayanthara

నయనాతర పెళ్లి వ్యవహారం పై ఇప్పటివరకు మీడియా హడావుడి చేయడమే తప్ప.. నయనతార నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దాంతో ఆమె పెళ్లి వచ్చే నెలలో అయినా నిజంగానే జరుగుతుందా ? లేక, ఎప్పటిలాగే ఇది కూడా రూమర్ గానే ముగుస్తోందా అంటూ నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు. తన పెళ్లి విషయంలో నయనతార ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Also Read: Sarkaru Vaari Paata Distributors: అయోమయంలో పడ్డ సర్కారు వారి పాట మూవీ డిస్ట్రిబ్యూటర్లు

ఐతే, గతంలో నయనతార ‘స్టార్ విజయ్ టెలివిజన్’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మాట్లాడింది. ఇంతకీ, నయనతార.. తన పెళ్లి గురించి ఏమి మాట్లాడింది అంటే.. తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపించి.. ఇది నా నిశ్చితార్థం రింగే. పెళ్లి కుమారుడు విగ్నేష్ శివనే. మా నిశ్చితార్థానికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

vignesh shivan and nayanthara

అందుకే ఇండస్ట్రీలో కూడా ఎవరికీ మా నిశ్చితార్థం గురించి తెలియదు. నిశ్చితార్ధానికి ఎవరిని పిలవక పోవడానికి కారణం.. నాకు సంబరాలు చేసుకోవడం, పెద్దగా హడావిడి చేయడం లాంటివి ఇష్టం ఉండవు. అందుకే మా నిశ్చితార్థ వేడుకను సింపుల్ గా జరువుకున్నాం. ఇక పెళ్ళి కూడా అలాగే చేసుకుంటాం’ అంటూ నయనతార చెప్పుకొచ్చింది.

కాబట్టి, పెళ్లి కూడా అయ్యిపోయాక, సింపుల్ గా మా పెళ్లి అయిపోయిందని చెబుతుందేమో. ఏది ఏమైనా లేడీ సూపర్ స్టార్ నయనతారకి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే ఆమె పెళ్లి ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది. మరి జూన్ 9న అయినా నయనతార పెళ్లి అవ్వాలని ఆశిద్దాం.

Also Read:Teenmar Mallanna- Puvvada: తీన్మార్ మల్లన్న రూ. 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలన్న మంత్రి
Recommended Videos


Exit mobile version