Victory Venkatesh New Movie: కొన్ని కాంబినేషన్స్ వినడానికి కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటి కలయిక గురించి ఈ రోజు ఉదయం నుంచి ఒక్కటే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరిదీ ఈ కాంబినేషన్ అంటే.. హీరో వెంకటేష్ – ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ లది. వెంకటేష్ ఇప్పటికే ఈ కలయికలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వెంకీ F3 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ఒక వెబ్‌సిరీస్ చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ దర్శకత్వంలో సినిమా చేయడానికి వెంకటేష్ ఎందుకు అంగీకారం తెలిపాడు ? కారణం ఏమై ఉంటుంది ? పైగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మైంట్స్ బ్యానర్ నిర్మించబోతుంది అని టాక్ నడుస్తోంది.
Also Read: Prabhas Radhe Shyam: సినిమా కొనుకున్న వాళ్ళు అన్యాయం అయిపోయారు
ఇక విక్టరీ వెంకటేశ్ కూడా ఓటీటీ ప్లాట్‌ఫాంలో హోస్టుగా అలరించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ‘ఆహా’లో వచ్చిన అన్‌స్టాపబుల్ టాక్ షో లాగే.. అల్లు అరవింద్ ‘ఆహా’ కోసం ఓ సరికొత్త ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నారని.. ఆ ప్రోగ్రామ్ కి వెంకటేశ్ హోస్ట్ గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలోనే రాబోతుందట. ఇక వెంకటేష్ లాస్ట్ సినిమా దృశ్యం 2. ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాగా ఆకట్టుకున్న ‘దృశ్యం’ నుంచి సీక్వెల్ గా వచ్చిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ లో వెంకటేష్ సరసన మీనా ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ఓటీటీ బాట పట్టి.. డిజిటల్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది.

మొత్తానికి వెంకీ బాలయ్యను ఫాలో అవుతున్నాడు. అయితే వెంకీ, బాలయ్య స్థాయిలో సక్సెస్ అవుతాడా ? నిజానికి ఇండియన్ ఓటీటీ షోలలోనే బాలయ్య షో నంబర్ వన్ షో అయింది. బాలయ్య నెంబర్ వన్ హోస్ట్ గా కూడా నిలిచాడు. మరి ఈ స్థాయిలో వెంకీ సక్సెస్ అవుతాడా ? చూడాలి.
Also Read: The Kashmir Files: కాశ్మీర్ ఫైల్స్ కి న్యూజిలాండ్ లో ఆటంకాలు
[…] Also Read: Victory Venkatesh New Movie: కొత్త కాంబినేషన్.. మరి వర్క… […]