
Umair Sandhu- Vijay Deverakonda: ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు మరో సంచలన ట్వీట్ చేశారు. ఓ నిర్మాత హీరో విజయ్ దేవరకొండ మీద మనసు పడ్డాడట. సదరు నిర్మాత కోరికను విజయ్ దేవరకొండ తిరస్కరించారట. ఈ మేరకు ఆయన చేసిన కామెంట్ వైరల్ అవుతుంది. ఉమర్ సంధు వివాదాస్పద ట్వీట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. పలువురు స్టార్స్ ని టార్గెట్ చేస్తూ ఆయన కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశాడు. ప్రభాస్-కృతి సనన్ కి ఎఫైర్ ఉందని. సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే రిలేషన్ పెట్టుకుందని… చెప్పుకుంటూపోతే ఇలాంటివి చాలానే ఉన్నాయి.
తాజాగా ఉమర్ సంధు నిర్మాత కరణ్ జోహార్ ఇజ్జత్ తీసే కామెంట్స్ చేశాడు. లైగర్ మూవీ షూటింగ్ సమయంలో కరణ్ జోహార్ విజయ్ దేవరకొండ మీద మనసుపడ్డాడట. తనతో పడుకోవాలని కోరాడట. అయితే కరణ్ జోహార్ ఆఫర్ ని విజయ్ దేవరకొండ తిరస్కరించాడట. ఈ మేరకు ఉమర్ సంధు ట్వీట్ చేయగా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కరణ్ జోహార్ గే అన్న వాదన పరిశ్రమలో ఉంది. దాని ఆధారంగా విజయ్ దేవరకొండను కరణ్ కోరకూడని కోరిక కోరాడని ఉమర్ సంధు కామెంట్ చేశారు.
లైగర్ మూవీకి కరణ్ జోహార్ సహ నిర్మాతగా ఉన్నారు. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించగా పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ కలిసి నిర్మించాయి. లైగర్ చిత్ర షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ ఎక్కువగా ముంబైలో ఉన్నారు. విజయ్ ని కరణ్ బాగా ఎలివేట్ చేశారు. విజయ్ దేవరకొండతో కరణ్ జోహార్ వరుస ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. లైగర్ డిజాస్టర్ కాగా… అక్కడ ఒక్కసారిగా విజయ్ దేవరకొండ ఫేడ్ అవుట్ అయ్యాడు.

లైగర్ విజయం సాధిస్తే విజయ్ దేవరకొండ కెరీర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేది. ఆ సినిమా కోసం ఆయన బాగానే కష్టపడ్డారు. మూవీలో కంటెంట్ లేకపోవడంతో అటకెక్కింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి మూవీ చేస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తుంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. లైగర్ మూవీ సెప్టెంబర్ 1న విడుదల కానుంది. దర్శకుడు పరుశురాం తో ఓ మూవీ ప్రకటించారు. దర్శకుడు సుకుమార్ తో కూడా ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది.
#KaranJohar tried his best to seduce #VijayDeverakonda. He wants to sleep with him during #Liger shoots but he REJECTED his offer badly.
— Umair Sandhu (@UmairSandu) March 24, 2023
