Site icon OkTelugu

Top Indian star actors: ఇండియాను ఏలే స్టార్ హీరోలు వీళ్లేనా..?

Top Indian star actors

Top Indian star actors

Top Indian star actors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోల హవా కోనసాగుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం పక్కనపెట్టి మన స్టార్ హీరోలు సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇప్పటికే మన హీరోల నుంచి వస్తున్న సినిమాలు ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు వరుసగా మన స్టార్ హీరోలందరు ఇండియన్ సినిమా బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ కోలుకోలేకుండా పోతుంది. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలే హీరోలు ఎవరు అనే దానిమీద విపరీతమైన చర్చలైతే నడుస్తున్నాయి. టాలీవుడ్ హీరోలే ఇండస్ట్రీ ని ఏలాబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ హీరోలు మాత్రం దీనికి తక్కువ కాదు మా నుంచి కూడా మంచి సినిమాలు రాబోతున్నాయి అంటూ వాళ్ళు కూడా పెను సవాళ్లను విసురుతున్నారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే మన స్టార్ హీరోలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరోలుగా మారబోతున్నారు. మరి అందులో ఎవరు ముందు వరుసలో ఉన్నారు అంటే ప్రభాస్,అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ టాప్ లో ఉన్నారు.

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని కుటుంబం తో కలిసి చూసిన మెగాస్టార్ చిరంజీవి.. వీడియో వైరల్!

ఇక మహేష్ బాబు సైతం ‘వారణాసి’ సినిమాతో ఇప్పుడు ఇండస్ట్రీలో అన్ని రికార్డులను బ్రేక్ చేస్తానంటూ కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. ఇక వీళ్లలో నెంబర్ వన్ హీరో ఎవరు అవుతారు. మొత్తానికైతే ఇండస్ట్రీని ఏలే హీరోలు ఎవరు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక బాలీవుడ్ సైతం ఇప్పుడిప్పుడే మరోసారి తమ సత్తా చాటుకునే ప్రయత్నం కూడా చేస్తుంది.

‘దురంధర్ 2’ సినిమా మరోసారి పెను సంచలనాన్ని సృష్టించింది. కాబట్టి ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ అయితే ఊపందుకుంటుంది. ఇక ఈ క్రమంలోనే మిగతా హీరోలు సైతం వరుస బ్లాక్ బస్టర్స్ ను అందుకుంటే ప్రాబ్లం లేదు. లేకపోతే మాత్రం మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీ డీలా పడిపోయే అవకాశమైతే ఉంది…

Exit mobile version