Site icon OkTelugu

Bunny: ‘తగ్గెదేలే’.. ఒక్క షాట్ కోసం 12 గంటలు కష్డపడిన బన్నీ..!

Bunny: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తాజాగా వచ్చిన చిత్రం ‘పుష్ప’. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెంట్ సాధించి అల్లు అర్జున్ ఖాతాలో మరో హిట్ మూవీగా నిలిచింది.‘పుష్ప’లో బన్నీ క్యారెక్టర్ ను సుకుమార్ స్పెషల్ గా డిజైన్ చేశాడు. అందుకు తగ్గట్టుగానే అల్లు అర్జున్ ఈ సినిమా మొత్తాన్ని ‘వన్ మ్యాన్ షో’గా ముందుకు నడిపించాడు.

Allu Arjun

నైజాం, మలయాళం, హిందీ, ఓవర్సీస్, యూఎస్ లో ‘పుష్ప’ మూవీ డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లారు. ఏపీలో టికెట్లు రేట్లు తక్కువగా ఉండటంతో అక్కడ మాత్రం నష్టాలు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఈ మూవీ హిట్ ఖాతాలోకి వెళ్లడంతో ‘పుష్ప-2’ను పట్టాలెక్కించేందుకు మూవీ మేకర్స్ సన్నహాలు చేసున్నారు.

‘పుష్ప’కు సంబంధించిన డిలీటేడ్ సీన్స్, వీడియో సాంగ్స్ ను చిత్రబృందం సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా విడుదల చేస్తూ అల్లు ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.  తాజాగా ‘పుష్ప’ టీం మరో అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీలో అల్లు అర్జున్ ఫేవరేట్ సాంగ్ ‘ఏయ్ బిడ్డా’ పాటలోని ఓ పిక్ ను షేర్ చేసింది.

ఈ పాటలో ఒక్క షాట్ కోసం ‘పుష్ప రాజ్’ 12గంటలపాటు కష్టపడ్డారని చిత్రయూనిట్ పేర్కొంది. మధ్యాహ్నం 2గంటలకు మొదలైన షూటింగ్ రాత్రి 12వరకు ఏకదాటిగా సాగిందని, ఈ సాంగ్ బన్నీ 24 డ్రెస్సులు ఒక్క సీన్ కోసం ఉపయోగించారనే విషయాన్ని వెల్లడించింది. అల్లు అర్జున్ హార్డ్ వర్క్ కు ఈ సాంగ్ ఒక నిదర్శమని పుష్ప టీం ప్రశంసలు కురిపించింది.

Exit mobile version