Parineeti Chopra: బాలీవుడ్ స్టార్ లేడీ పరిణీతి చోప్రా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి జరిగి నెల రోజులు గడవలేదు. హానీ మూన్ మాత్రం వేరొకరితో ప్లాన్ చేసింది. పరిణీతి చోప్రా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రియాంక చోప్రా చెల్లెలు పరిణీతి చోప్రా 2011లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఆమె డెబ్యూ మూవీ లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం యావరేజ్.
రెండో చిత్రం ఇష్క్ జాదే చిత్రంతో హిట్ కొట్టింది. అనంతరం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి జంటగా నటించిన శుద్ దేశీ రొమాన్స్ ఆమెకు ఫేమ్ తెచ్చింది. ఈ మూవీ విజయం సాధించింది. గోల్ మాల్ అగైన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన పరిణీతి చోప్రా కెరీర్లో కేసరి మరో హిట్ గా ఉంది. అయితే ఆమె కెరీర్లో విజయాలు శాతం కంటే అపజయాల శాతం ఎక్కువ. దాంతో టాప్ హీరోయిన్స్ లో ఒకరు కాలేకపోయింది.
కెరీర్ నెమ్మదిస్తున్న తరుణంలో పొలిటీషియన్ ని లైన్లో పెట్టింది. ఎంపీ రాఘవ్ చద్దాతో కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తుంది. ఈ ఏడాది సమ్మర్ లో అత్యంత సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ జరుపుకుంది. సెప్టెంబర్ 24న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో రాఘవ్ చద్దా-పరిణీతి చోప్రా వివాహం జరిగింది. కాగా చెల్లి పరిణీతి చోప్రా పెళ్ళికి ప్రియాంక చోప్రా హాజరు కాలేదు. ప్రియాంక యూఎస్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే…
కాగా ప్రస్తుతం పరిణీతి చోప్రా మాల్దీవ్స్ లో హానీ మూన్ ఎంజాయ్ చేస్తుంది. అయితే తన హనీ మూన్ ట్రిప్ లో భర్త రాఘవ్ చద్దా లేదట. నా హనీ మూన్ కాదు. నేను వేరొకరితో వచ్చాను. ఈ ఫోటో తీసింది నా మరదలు అంటూ షాక్ ఇచ్చింది. పెళ్ళైన తర్వాత ఏకాంతంగా భర్తతో గడిపే ట్రిప్ హనీ మూన్ అంటారు. పెళ్ళైన కొత్తలో భర్తతో హనీమూన్ కి వెళ్లడం గొప్ప అనుభూతి. అలాంటి అందమైన అనుభవాన్ని మీరు ఎలా మిస్ అయ్యారని పరిణీతి చోప్రా మీద నెటిజెన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.