Rashmika Mandanna: యానిమల్ మూవీకి రష్మిక రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అందుకే అలా రెచ్చిపోయిందా!

అర్జున్ రెడ్డికి మించి వైలెంట్, వైల్డ్ గా యానిమల్ లో రన్బీర్ కపూర్ రోల్ డిజైన్ చేశారు. ఈ క్రమంలో శృంగార సన్నివేశాల డోసు కొంచెం ఎక్కువగానే ఉంది. ఇలాంటి పాత్ర చేయాలంటే హీరోయిన్ కి గట్స్ ఉండాలి.

Written By: NARESH, Updated On : December 2, 2023 5:42 pm

Rashmika Mandanna

Follow us on

Rashmika Mandanna: ముద్దు సన్నివేశాలు రష్మిక మందానకు కొత్తకాదు. కెరీర్ బికినింగ్ లోనే లిప్ లాక్ వంటి బోల్డ్ సీన్స్ చేసింది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో రష్మిక-విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ కేక. ఇద్దరూ బాగా ఇన్వాల్వ్ అవి మరీ లిప్ లాక్ సీన్ చేశారు. అయితే యానిమల్ కథ వేరు. ఇది నెక్స్ట్ లెవెల్ రొమాన్స్. లెక్కకు మించి లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. ఇద్దరి మధ్య గాఢమైన బంధం చెప్పాలంటే లిప్ లాక్ చేయించడమే అని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ నమ్ముతాడు.

అర్జున్ రెడ్డికి మించి వైలెంట్, వైల్డ్ గా యానిమల్ లో రన్బీర్ కపూర్ రోల్ డిజైన్ చేశారు. ఈ క్రమంలో శృంగార సన్నివేశాల డోసు కొంచెం ఎక్కువగానే ఉంది. ఇలాంటి పాత్ర చేయాలంటే హీరోయిన్ కి గట్స్ ఉండాలి. కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా పూర్తి నిడివి కలిగిన కీలక రోల్. అందుకే రష్మిక గట్టిగానే డిమాండ్ చేసిందట. యానిమల్ మూవీకి రష్మిక రికార్ట్ స్థాయిలో రెమ్యూనరేషన్ వసూలు చేసినట్లు సమాచారం.

సాధారణంగా రష్మిక సినిమాకు రూ. 3-4 కోట్లు తీసుకుంటుంది. యానిమల్ ప్రొడ్యూసర్స్ మాత్రం రూ. 7 కోట్లు ఇచ్చారట. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అదే నిజమైతే రెండింతల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లే. ఇండియాలో దీపికా పదుకొనె, నయనతార వంటి అతికొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే ఏడు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

రష్మిక లిప్ లాక్ సీన్స్ చేసేందుకు రూ. 25 లక్షలు ఎక్స్ట్రా డిమాండ్ చేసిందంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. ఏది ఏమైనా యానిమల్ బాక్సాఫీస్ షేక్ చేస్తున్న క్రమంలో రష్మిక ఖాతాలో భారీ హిట్ పడింది. ఫస్ట్ డే యానిమల్ రూ. 116 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. సెకండ్ డే కూడా కలెక్షన్స్ సాలిడ్ గా ఉన్నాయి. నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెంట్ కి చేరువైపోయింది. యానిమల్ తెలుగు రాష్ట్రాల బయ్యర్లకు కూడా లాభాలు పంచడం ఖాయం. రన్బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకుడు.