Homeఎంటర్టైన్మెంట్Week End Movies: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే

Week End Movies: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే

Week End Movies: ఈ మధ్య కాలంలో థియేటర్లలో సినిమాలు భారీ లెవెల్​లో విడుదలవుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని సినిమాలు ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అఖండ సినిమా ఘన విజయం తర్వాత ఊపిరి పీల్చుకున్న ఫిల్మ్ ఇండస్ట్రీ ఇకపై సినిమాలు విడుదల చేయొచ్చని భరోసాను కల్పించారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

కాగా తాజాగా ఈ వారంలో పలు స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. లాస్ట్​ వీక్​ విడుదలైన సినిమాలు బాలయ్య హవాను తట్టుకోలేకపోయాయి. అయితే, ఈ వారం వచ్చే సినిమాల తీరు అలా కాదు.. రిలీజ్​కు వారం రోజుల ముందే ఇండియాలో రికార్డు స్థాయిలో బుకింగ్స్​ జరుగుతున్నాయి. అది కూడా హాలీవుడ్ సినిమా స్పైడర్​మ్యాన్​కు ఇంత క్రేజ్​. ఈ క్రమంలోనే ఈ వారం సందడి చేయనున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం.

Week End Movies
Week End Movies

హాలీవుడ్​లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్​ సంపాదించుకున్న కామిక్ రోల్​ స్పైడర్ మ్యాన్​. ఈ సారి మరింత వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యారు ఈ హీరో. ఈ క్రమంలనే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్  అంటూ వస్తున్నారు. డిసెంబరు 17న ఈ సినిమా విడుదల కాగా.. ఇండియాలో మాత్రం ఒకరోజు ముందే అంటే డిసెంబరు 16న విడుదల కానుంది.

Also Read: టికెట్ రేటు విషయంలో హైకోర్టు తీర్పుపై… డివిజనల్ బెంచ్ లో పిటిసన్ వేసిన ఏపీ సర్కారు

మరోవైపు సుకుమార్​ దర్శకత్వంలో వస్తోన్న పుష్ప సినిమా కూడా డిసెంబరు 17న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, ట్రైలర్​లు విపరీతమైన అంచనాలు క్రియేట్​ చేశాయి. ఇందులో రష్మిక హీరోయిన్​గా నటిస్తుండగా.. అల్లు అర్జున్ హీరోగా కనిపించనున్నారు.

మరోవైపు పూర్ణ, తేజ హీరో హీరోయిన్లుగా బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బ్యాక్​డోర్​. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా శుక్రవారం విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం యువత ఎలా ఆలోచిస్తోంది.. ఎలా తప్పుదారి పడుతున్నారన్న అంశంపై ఈ సినిమా తెరకెక్కించారు. ఈ నెల 18న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

Also Read: పుష్పకు కష్టాలు మొదలయ్యాయి.. అల్లు అర్జున్ స్వయంకృపరాధం!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version