Samantha Naga Chaitanya : సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు పెళ్లి చేసుకోవడం, విడిపోవడం సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే వాళ్లు సినిమాలు చేసినప్పుడు వాళ్ళ మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ వల్ల పెళ్లి చేసుకుంటున్నారు. ఇక కాలక్రమం లో అది లోపించడంతోనే విడాకులు తీసుకుంటున్నారు అంటూ మరి కొంత మంది నటీ నటులు పెళ్లిళ్లు చేసుకొని ఈ విషయాన్ని తెలియజేస్తూ సపరేట్ అయిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే 2017 వ సంవత్సరంలో అంగరంగ వైభవం గా పెళ్లి చేసుకున్న నాగచైతన్య సమంతలు సైతం 2021 లో విడిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే దీనికి కారణం ఏంటి అనేది స్పష్టంగా తెలియనప్పటికీ వీళ్ళ విడాకుల సమయంలో మాత్రం వీళ్ళు డివోర్స్ తీసుకోవడానికి సమంతనే కారణం అంటూ సమంత మీదనే మొత్తం నేరమంత మోపారు. ఇక దానికి కారణం ఏంటి అంటే సమంత బాలీవుడ్ బోల్డ్ సీరీస్ అయిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో నటించడమే దానికి కారణం అంటూ పలు రకాల కథనాలైతే వెలువడ్డాయి. ఇక అక్కినేని ఫ్యామిలీ వారు ఎంత చెప్పిన వినకుండా ఆమె ఆ సిరీస్ లో నటించిందని దానివల్లే చైతన్య సమంత నుంచి డివోర్స్ తీసుకున్నారని అందులో సమంతది తప్పు అన్నట్టుగా రూమర్లు వచ్చాయి…
నిజానికి బోల్డ్ సీన్ల లో నటించడం వల్లే నాగచైతన్య విడాకులు ఇచ్చేస్తాడా అంటూ పలు రకాల ప్రశ్నలు కూడా తలెత్తాయి. నిజానికి అక్కినేని ఫ్యామిలీ గత 50 సంవత్సరాలకు పైన నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కాబట్టి వాళ్లకి సినిమా ఇండస్ట్రీ పైన అవగాహన ఉండడంతో పాటు నటీనటుల మధ్య ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉంటుందో కూడా వాళ్లకు తెలుసు…కాబట్టి తను బోల్డ్ సీన్ లో నటించడం వల్లే నాగచైతన్య విడాకులు ఇచ్చాడు అనేది వట్టిమాటే.. ఎందుకంటే ఆయన ఇప్పుడు సమంత కంటే ఎక్కువ బోల్డ్ సీన్ల లో నటించిన ‘శోభితా ధూళి పాళ’ ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు.
ఇక రీసెంట్ గా వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. మరి తను కూడా చాలా బోల్డ్ సినిమాల్లో నటించి నటి గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక సమంత బోల్డ్ సీన్స్ లో నటించడం వల్లే తనకు విడాకులు ఇచ్చాడు అని అనుకుంటే అంతకంటే ఎక్కువ బోల్డ్ సీన్లలో నటించిన శోభిత ధూళి పాళ ను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు. విడాకులకి కారణం ఆ సినిమా మాత్రం కాదు. మిగతాది ఏదో ఉండి ఉంటుంది అంటూ కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగ చైతన్య తొందర్లోనే పెళ్లి చేసుకొని తన లైఫ్ ను తను లీడ్ చేయాలని చూస్తున్నాడు.
సమంత నుంచి విడాకులు ఇచ్చిన వరకు ఆయన ఇప్పుడు శోభితా తో చూసుకొని ఒక ఇంటివాడు అవుతున్నందువల్ల అటు నాగార్జున గాని, అక్కినేని అభిమానులకు గాని సంతోషంతో ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇప్పటికైనా నాగచైతన్య సమంత విడాకుల పైన వస్తున్న రూమర్లకి చెక్ పెడితే మంచిదని మరి కొంతమంది సినీ మేధావులు సైతం ఈ విషయం పైన వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…