Bigg Boss 7 Telugu Elimination: బిగ్ బాస్ తెలుగు 7 సక్సెస్ఫుల్ గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 13 మంది కంటెస్టెంట్స్ హౌస్లో ఉండగా శనివారం హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఇంటి సభ్యుల పెర్ఫార్మన్స్ ఆధారంగా మీటర్ లో రేటింగ్ ఇచ్చారు. కొందరు కంటెస్టెంట్స్ కి క్లాస్ పీకాడు. బాగా ఆడిన వారిని అభినందించారు. ఇక నామినేషన్స్ లో ఉన్న 9 మంది నుండి ఇద్దరు సేవ్ అయ్యారు. పవర్ అస్త్ర గెలిచిన శివాజీ ఎలిమినేషన్ నుండి ఇమ్యూనిటీ పొందాడు. శివాజీ నేరుగా సేఫ్ అయ్యాడు.
ఇక 8 మంది ఎలిమినేషన్స్ లో ఉన్నారు. వారి నుండి అమర్ దీప్ సేఫ్ అయ్యాడు. ఇక రతికా రోజ్, ప్రిన్స్ యావర్, టేస్టీ తేజా, పల్లవి ప్రశాంత్, షకీలా, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి ఎలిమినేషన్స్ లో వీరితో అతి తక్కువ ఓట్లు పోలైన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు. అందుతున్న సమాచారం ప్రకారం పల్లవి ప్రశాంత్ మరోసారి జోరు చూపించాడు. అతడు ఓటింగ్ లో టాప్ లో ఉన్నట్లు సమాచారం.
టేస్టీ తేజా, షకీలా అతి తక్కువ ఓట్లతో డేంజర్ జోన్లో ఉన్నట్లు సమాచారం. ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం షకీలా ఇంటిని వీడనున్నారు. వరుసగా రెండో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియా టాక్. షకీలా హౌస్లో ఉన్న టాప్ సెలబ్రిటీ అని చెప్పొచ్చు. ఒకప్పుడు గ్లామర్ ఇండస్ట్రీని ఆమె ఏలారు. లేడీ కమెడియన్ గా కూడా రాణించారు. వందల చిత్రాల్లో నటించిన షకీలా కొన్నాళ్ళు హౌస్లో ఉంటుందని అందరూ అంచనా వేశారు. అనూహ్యంగా ఆమె రెండో వారమే ఇంటి బాట పట్టారు.
అలాగే వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయని తెలుస్తోంది. ప్రముఖంగా అంబటి అర్జున్ ఈపేరు వినిపిస్తోంది. పలు సీరియల్స్, సిరీస్లు, సినిమాల్లో నటించిన అంబటి అర్జున్ కి బుల్లితెర ఆడియన్స్ లో గుర్తింపు ఉంది. అతడి ఎంట్రీ దాదాపు ఖాయమే అంటున్నారు. అలాగే సీరియల్ నటి పూజా మూర్తి రానున్నారట. తండ్రి మరణించిన నేపథ్యంలో పూజా మూర్తి చివరి నిమిషంలో ఆగిపోయారు. ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తారట. అలాగే హీరోయిన్ ఫర్జానా పేరు వినిపిస్తోంది.